గోపాల గోపాల సినిమా సీన్: పండ్ల వ్యాపారికి రూ. 14 లక్షల నష్టపరిహారం
న్యూఢిల్లీ: ట్రక్కు ఢీకొని రోడ్డు ప్రమాదంలో వైకల్యానికి గురైన 45 ఏళ్ల ధరమ్ పాల్ అనే వ్యక్తికి రూ. 14 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని మ్యాక్ట్ మోటార్ యాక్సిడెంట్ క్లయిమ్స్ ట్రిబ్యునల్ ప్రకటించింది. ట్రక్కు డ్రైవర్ మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం సంభవించింది కాబట్టి ధరమ్ పాల్‌కు నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ ట్రక్కుకు భీమా సౌకర్యాన్ని కల్పించిన న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీకి మాక్ట్ అధ్యక్ష అధికారి కిరణ్ బన్సల్ ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే.. ధరమ్ పాల్ అనే వ్యక్తి పండ్ల వ్యాపారి. సైకిల్‌పై తిరుగుతూ పండ్లు అమ్ముకునే వాడు. అక్టోబర్ 13, 2011న షాహిబాబాద్‌కు పండ్లు అమ్ముకునేందుకు వెళ్తున్న సమయంలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఆయన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ధరమ్ పాల్ ఎడమ కాలు పూర్తిగా దెబ్బతిని అంగవైకల్యానికి గురయ్యాడు.

పూర్తిగా కోలుకునేందుకు రెండు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆనంతరం వివిధ ప్రాంతాల్లో సైకిల్‌పై పండ్లు అమ్ముకుంటూ నెలకు రూ. 10,000 వరకు సంపాదించే నేను ఈ ప్రమాదం వల్ల సర్వస్వం కోల్పోయానని, తనకి తగిన న్యాయం చేయాలని ధరమ్‌పాల్ ట్రిబ్యునల్‌కు ఓ పిటిషన్‌ను దాఖలు చేశాడు.
పిటిషన్‌పై స్పందించిన మోటార్ వెహికిల్ క్లయిమ్స్ ట్రిబ్యునల్ ధరమ్ పాల్‌కు రూ. 14,45,027లను నష్ట పరిహారాన్ని ఇవ్వాల్సిందిగా న్యూఇండియా ఎస్యూరెన్స్ కంపెనీని ఆదేశించింది.












Click it and Unblock the Notifications