వంద కాదు రెండొందలు కాదు రూ.32 వేల 500 ఫైన్.. చలానా చూసి ఖంగుతిన్న ఆటో యజమాని..!!
గురుగ్రామ్ : కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. హెల్మెట్ పెట్టుకోలేదని టూవీలర్ రైడర్‌కు నిన్న రూ.23 వేల ఫైన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో వాహనదారుడు లబోదిబోమనగా .. మిగతా రైడర్లు కూడా ఆందోళన చెందారు. ఇదిలాఉంటే నిన్న గురుగ్రామ్ పరిధిలో ఆటోకు కూడా భారీమొత్తంలో జరిమానా విధించారు. రూ.32 వేల 500 ఫైన్ వేయడంతో ఆటో యాజమాని మహ్మద్ ముస్తాకిల్ బోరుమని విలపించాడు.

ఆటోకు రూ.32,500 ఫైన్
కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం ఆటో రిక్షా యజమానికి ఫైన్ వేశారు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముస్తాకిల్ పొట్ట కూటి కోసం ఢిల్లీ వచ్చారు. గత 15 ఏళ్ల నుంచి గురుగ్రామ్‌లో ఉంటున్నారు. నిన్న సికందర్‌పూర్ వద్ద గల సెక్టార్ 26 రహదారిపై రెడ్‌లైట్ పడింది. రెడ్ లైట్ పడిన ఆటో రిక్షాను యధేచ్చగా వెళ్లాడు. దీంతో నిబంధనలను అతిక్రమించారని భావించి ఫైన్ వేశారు. ఆటోను నిలిపి .. పేపర్లు చూపించాలని కోరారు. అయితే సరైన ధ్రువపత్రాలు లేకపోవడం చూసి ట్రాఫిక్ పోలీసులు ఖంగుతిన్నారు. ఆటో రిక్షాకు సంబంధించిన డాక్యుమెంట్లను డీఎల్ఎఫ్ ఫేజ్-3 వద్ద వదిలేశానని అతని చెప్పారు. తనకు 10 నిమిషాల సమయం ఇస్తే ఆర్సీ, సీ బుక్ తీసుకొస్తానని చెప్పారు. వారిని అర్థించిన ప్రయోజనం లేకపోయింది. ఆటో యజమాని మాటను ట్రాఫిక్ పోలీసులు లెక్కచేయలేదు.

ఇదీ లెక్క
ముస్తాపిల్ ఆటోకు ట్రాఫిక్ పోలీసులు రూ.32 వేల 500 ఫైన్ చేశారు. చాలానాలో దానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోవడంతో మరో రూ.5 వేలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రూ.2 వేలు, ఎయిర్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడంతో రూ.10 వేలు, సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకపోవడంతో రూ.500, భయంకరంగా ఆటో నడుపుతున్నందుకు రూ.5 వేలు, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినందుకు మరో రూ.5 వేల జరిమానా విధించారు. చిత్రమేమిటంటే టూవీలర్ రైడర్‌కు కూడా ఇలాంటి కారణాలతోనే జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

ఫైన్ కట్టకపోవడంతో ..
ముస్తాకిల్ ఆటోకు రూ.32 వేల 500 ఫైన్ వేయడంతో ఆయన కట్టలేకపోయాడు. దీంతో ఆటోను ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారు. ఈ అంశాన్ని తన లాయర్‌కు వెల్లడించి ఆటో రిక్షాను తీసుకొస్తానని ముస్తికిల్ చెప్తున్నారు. ఇప్పుడు తన వద్ద అన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో తనకు విధించిన చాలానా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త వాహన చట్ట సవరణ బిల్లుకు జూలైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications