రూ.5కే చేపల కూరతో భోజనం ..! సువేందు మరో సంచలనం..!
పశ్చిమ బెంగాల్లో (West Bengal) తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంచలనం రేపిన సీఎం సువేందు అధికారి. (Suvendu Adhikari). ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పేదలకు మన రాష్ట్రాల తరహాలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించారు. అందులోనూ కేవలం రూ.5కే పేదలకు చేపల కూరతో భోజన సదుపాయం (Fish-Rice Meal) కల్పించబోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో సైతం శాకాహార భోజనాన్ని ఇలా రూ.5కు వడ్డిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 400 ప్రత్యేక క్యాంటీన్లలో రూ.5కే చేప-బియ్యం భోజనం అందించనున్నట్లు సీఎం సువేందు అధికారి ఇావాళ ప్రకటించారు.కల్యాణిలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంటీన్ల ద్వారా ఈ రాయితీ భోజనాన్ని అందించనున్నట్లు తెలిపారు. బెంగాలీ ప్రజల ప్రధాన ఆహారమైన చేపలు, మాంసం, గుడ్లపై బీజేపీ పూర్తి నిషేధం విధిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ తాజా ప్రకటన వెలువడింది.

రెండు నెలల క్రితం ఎన్నికల సభలో అప్పటి సీఎం మమతా బెనర్జీ.. బీజేపీని లక్ష్యంగా చేసుకుని "బెంగాల్ ప్రజలు చేపలు, అన్నం మీదే బతుకుతున్నారు. మీరు ప్రజలకు చేపలు తినకూడదు, మాంసం తినకూడదు, గుడ్లు తినకూడదు అని చెబుతున్నారు, మరి అప్పుడు వాళ్ళు ఏం తింటారని ప్రశ్నించారు. అయితే, బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది. తాము అధికారంలోకి వస్తే అలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చింది.

వాస్తవానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిరుపేదలకు రూ.5కే ఆహారం అందించేందుకు ప్రారంభించిన 'మా' క్యాంటీన్, రాష్ట్ర ప్రజల్లో భారీ విజయం సాధించింది. మధ్యాహ్నం 12:30 నుండి 3:00 గంటల వరకు పనిచేసే ప్రతి క్యాంటీన్‌లో, దాదాపు వంద మందికి అన్నం, పప్పు, కూర, మరియు గుడ్డు కూర అందిస్తున్నారు. ఇప్పుడు అందులో సువేందు అధికారి ఇలా చేప కూరతో భోజనం అందుబాటులోకి తెస్తున్నారు.












Click it and Unblock the Notifications