కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన మరో పార్టీ: చర్చకు వచ్చేనా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా, ఆ జాబితాలో ఆర్‌ఎస్పీ చేరింది. ఆర్ఎస్పీ సభ్యుడు ఎన్‌కే ప్రేమ్ చంద్రన్ లోక్‌సభ కార్యదర్శికి అవిశ్వాస నోటీసు పంపారు.
హేతుబద్ధత లేకుండా విభజించిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవిశ్వాస నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు పార్లమెంట్‌లో తమ సమస్యలపై పోరాటం చేయడంతో ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించడంతో పాటు వాయిదాల పరంపర కొనసాగుతోంది.
కాగా, సోమవారం సీపీఎం లోక్‌సభాపక్ష నేత కరుణాకరణ్ కూడా కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇచ్చారు. తాజాగా ఆర్‌ఎస్పీ కూడా కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మంగళవారం అవిశ్వాస తీర్మానంపై చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications