ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సన్నద్దం, దళితులు, ఓభిసిలు లక్ష్యంగా పావులు
వచ్చే ఏడాదిలో ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే ఎన్నికలకోసం పార్టీలు ప్లాన్ లు చేస్తున్నాయి. అయితే ఆర్ ఎస్ ఎస్ కొంతకాలంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకొని చేస్తోన్న ప్లాన్ బిజెపికి కలిసివచ్చే అవకాశం
ఉత్తర్ ప్రదేశ్ :ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి . ఈ ఎన్నికలు బిజెపి , సమాజ్ వాదీ పార్టీ, బిఎస్ పి , కాంగ్రెస్ పార్టీలకు కీలకమైనవి. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించేందుకు అన్ని రకాల వ్యూహలను సిద్దంచేస్తోంది. .దళితులు, ఓబిసి సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేసింది.ఆర్ఎస్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు బిజెపికి కలిసివస్తాయా అనే చర్చ కూడ సాగుతోంది.
వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. అయితే సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సమస్యలు ఆ పార్టీని ఇబ్బందులు పెడుతున్నాయి.
బిఎస్ పి అధినేత మాయావతి కూడ ఉత్తర్ ప్రదేశ్ లో అధికారం కోసం ప్రణాళికలను సిద్దం చేసుకొంటుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి , ఈ దఫా ఎలాగైనా ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో ఉంది.
ఈ రాష్ట్రం నుండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటున్నాడు.

ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలు బిజెపికి ప్రయోజనం కల్గిస్తాయా
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే మూడేళ్ళుగా ఆర్ఎస్ ఎస్ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆర్ఎస్ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుండే బిజెపి అత్యధిక స్థానాలను కైవసం చేసుకొంది. అయితే ఇదే తరహలో అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ వ్రణాళికలు సిద్దం చేస్తోంది.

సమాజ్ వాదీకి కుటుంబసమస్యలు
అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో బాబాయ్ అబ్యాయిల మద్య పొసగడం లేదు. అబ్బాయి వ్యతిరేక వర్గీయులకు బాబయ్ శివపాల్ యాదవ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన అసెంబ్లీ టిక్కెట్ల జాబితాలో అఖిలేష్ వ్యతిరేక వర్గీయులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శివపాల్ యాదవ్.శివపాల్ కే తండ్రి ములాయం సింగ్ మద్దతుగా నిలుస్తున్నారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు పార్టీపై ప్రభావం చూపుతున్నాయి.

బిఎస్ పి ఓటు బ్యాంకు గండి కొట్టేలా ఆర్ ఎస్ ఎస్ వ్యూహరచన
సామాజిక కార్యక్రమాల్లో ఆర్ ఎస్ ఎస్ ముందుంటుంది. అయితే ఈ కార్యక్రమాల పేరుతో ప్రజలకు మరింత చేరువ కావడం ద్వారా రానున్న ఎన్నికల్లో బిజెపికి ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. సంప్రదాయికంగా ఓకే పార్టీకి ఓటు వేస్తున్నవారు రానున్న ఎన్నికల్లో ఇతరులకు ఓటు వేసేలా సామాజిక కార్యక్రమాలు దోహదపడే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు.

సామాజిక వర్గాల వారీగా ప్లాన్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 20 శాతం దళితులు, 50 శాతం ఓబిసి కులాలు ఓట్లు అధికారాన్నిచేజిక్కించుకొనేందుకు దోహదడపడుతాయి. ఈ ఓట్లను బిజెపికి అనుకూలంగా మలుచుకొనేందుకు ఆ పార్టీ వ్యూహరచనచేస్తోంది. దీనికితోడు సంఘ్ పరివార్ కూడ తన కార్యాచరణను అమలుచేస్తోంది. దళితవాడలు, ఓబిసిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలను చేపడుతోంది సంఘ్ పరివార్ . మద్యపానాన్ని సుమారు 55 శాతం మాన్పించారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళల్లో పరివార్ పై విశ్వాసం ఏర్పడింది. విద్య,వైద్యం, సామాజిక కార్యక్రమాలు, స్వయంఉపాది అవకాశాలపై కూడ కేంద్రీకరించింది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications