విద్యాసాగర రావును అడ్డుకున్నారు ఇలా.. (పిక్చర్స్)

ముంబై: మహారాష్ట్ర శాసన సభ సమావేశాల తొలి రోజు బుధవారం శాసనసభలోకి ప్రవేశించే సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావును నెట్టివేసి ఆయన లోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అయిదుగురు శాసన సభ్యులను స్పీకర్ హరిబాహు బాగ్డే రెండేళ్ల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అంతకుముందు శాసన సభలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. ప్రభుత్వ బలపరీక్షకు మూజువాణి ఓటు విధానం చేపట్టినందుకు కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. అదే సమయంలో గవర్నర్ విద్యాసాగర రావు సభను ఉద్దేశించి ప్రసంగించేందుకి వచ్చారు.

ఈ సమయంలో కాంగ్రెస్ శాసన సభ్యులు గవర్నర్ విద్యాసాగర రావును సభలోకి అడ్డుకున్నారు. ఆయనను ఘెరావ్ చేశారు. ఆయనను పక్కకు తోసే ప్రయత్నం కూడా చేశారు. విద్యాసాగర రావుకు స్వల్ప గాయాలు అయ్యాయి. గవర్నర్ పట్ల అనుచిత ప్రవర్తనకు సభాపతి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన వేటు వేశారు. సభ నుండి వారిని రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు.

ఫడ్నవీస్, విద్యాసాగర రావు

ఫడ్నవీస్, విద్యాసాగర రావు

బలపరీక్షలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నెగ్గిన అనంతరం శాసనసభలో ప్రసంగించేందుకు వస్తూ రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు.

విద్యాసాగర రావు

విద్యాసాగర రావు

గవర్నర్ విద్యాసాగర రావును కాంగ్రెస్ శాసన సభ్యులు అడ్డుకోవడంతో ఆయన ఎడం చేతికి గాయాలయ్యాయంటూ రెవిన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే ఐదుగురు సభ్యుల సస్పెన్షన్‌కు సభలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. సస్పెండయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో రాహుల్ బోంద్రే, అమర్ కాలే, జయకుమార్ గోరే, అబ్దుల్ సత్తార్, వీరేంద్ర జగ్తాప్‌లున్నారు.

విద్యాసాగర రావు

విద్యాసాగర రావు

ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నివేదిక సమర్పించేందుకు ఒక సభా కమిటీని ఏర్పాటు చేసారు. ఇదిలా ఉండగా తాము రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును గాయపరచలేదని సస్పెండయిన అయిదుగురు కాంగ్రెస్ సభ్యులు అంటూ, ఈ మొత్తం ఉదంతం బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆరోపించారు.

మహా శాసన సభకు

మహా శాసన సభకు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరిణీతి షిండే, వర్షా గైక్వాడ్‌లు బుధవారం శాసన సభకు వస్తున్న దృశ్యం.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

తాము గవర్నర్‌ను నెట్టివేయలేదని వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ సంఘటనపై బీజేపీ ఎమ్మెల్యే గిరీశ్ మహాజన్ చెప్పిన కథనాన్ని ప్రత్యక్ష సాక్షి కథనంగా పరిగణనలోకి తీసుకున్నారని, తమ వాదనను వినిపించడానికి అవకాశమివ్వలేదన్నారు. గవర్నర్ అంగరక్షకుడైన మహాజన్ ఘటన జరిగిన చోట ఎందుకున్నారని కూడా వారు ప్రశ్నించారు. సంఘటన జరిగినప్పుడు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నందున వాస్తవాలేమిటో పరిశీలించాలని వారు అన్నారు.

మహారాష్ట్ర

మహారాష్ట్ర

దర్యాప్తు తర్వాత మేము నిర్దోషులమనే విషయం రుజవు అవుతుందనే గట్టి నమ్మకం తమకు ఉందని, ఒకవేళ ప్రభుత్వం గనుక మమ్మల్ని రెండేళ్లు సభకు దూరంగా ఉంచినట్లయితే తాము రాష్టవ్య్రాప్తంగా పర్యటించి బీజేపీ తప్పులను ఎత్తి చూపించడానికి ప్రజల ముందుకెళ్తామని వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+