దారుణం: రష్యన్ యువతిపై యాసిడ్ దాడి
వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వారణాసిలోని కరౌండి ప్రాంతంలో నివసిస్తున్న రష్యా జాతీయురాలైన ఓ 23 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా, ఉదయం 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెపై యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు.
స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి యువతికి బాగా తెలిసిన వాడై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వారణాసి ఎస్‌ఎస్పీ తెలిపారు.

వృద్ధ దంపతుల హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని కైలాష్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. అయితే దంపతులు నివసిస్తున్న ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
దోపిడీకి వచ్చిన దుండగులు దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మనోహర్ లాల్ మదన్(84), విమల(80)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications