పార్లమెంట్ విషయాల్లో దిట్ట: ఎవరీ అహ్లువాలియా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పార్లమెంట్ విషయాల్లో దిట్టగా పేరుగాంచిన వ్యక్తి తన రాజకీయ జీవితమే ముగిసిపోయిందనుకొని రాజ్యసభలో ఉద్వేగభరితంగా ప్రసంగించాడు. ఆ తర్వాత లోక్‌సభ ఎంపీ అవడంతో పాటు మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ కొత్తగా తీసుకున్న 19 మంది మంత్రుల్లో ఒకరిగా నిలిచారు.

ఆయనే డార్జిలింగ్‌ లోక్‌సభ ఎంపీ సురేంద్రజిత్‌ సింగ్‌ అహ్లువాలియా. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం తన రాజకీయ జీవితం పూర్తిగా ముగిసిపోయిందని అనుకున్నారు. అసన్‌సోల్‌లో స్కూలింగ్ పూర్తి చేసిన అహ్లువాలియా బుర్ద్వాన్ యూనివర్సిటీ, కాలికట్ యూనివర్సిటీలో తన ఉన్నత చదవులు చదివారు.

65 ఏళ్ల అహ్లువాలియాని పార్లమెంట్ వ్యవహారాల విషయంలో 'ఎన్‌సైక్లోపీడియా'గా అభివర్ణిస్తారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్‌లకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. నాలుగు సార్లు రాజ్యసభ ఎంపీగా చేసిన అప్పట్లో పార్టీ అహ్లువాలియాకు మళ్లీ టిక్కెట్‌ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించింది.

S S Ahluwalia: Darjeeling MP and expert in parliamentary matters (Profile)

దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మన్మోహాన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా ఉన్న ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. తన మిగిలిన జీవితాన్ని పాట్నాలోని తన స్వగృహంలో గడుపుతానని ప్రకటించారు.

అంతేకాదు తన ప్రసంగంలో రాజ్యసభలో బీజేపీ తరుపున లీడర్‌గా ఉన్న జైట్లీతో పాటు రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అయితే గడచిన ఎన్నికల్లో అనూహ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

S S Ahluwalia: Darjeeling MP and expert in parliamentary matters (Profile)

అహ్లువాలియా పశ్చిమబెంగాల్‌ విద్యార్థి సంఘనాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1986లో రాజీవ్‌గాంధీ ఆయన్ను రాజ్యసభకు నామినేట్‌ చేశారు. అప్పట్లో రాజీవ్‌ గాంధీకి వీరవిధేయుడిగా పేరు తెచ్చుకున్న ఆయన రాజీవ్‌ హత్య అనంతరం సోనియా వద్ద కూడా అదే విధేయతను చూపించారు.

ఆ తర్వాత 1995లో పీవీ నరసింహారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా 2000లో బీజేపీలో చేరారు. మే 7, 2015 బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య కుదుర్చుకున్న భూ సరిహద్దు ఒప్పందం పార్లమెంట్‌లో ఆమోంద పొందడంలో కీలక పాత్ర పోషించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Once a key member of former Prime Minister Rajiv Gandhi's "shouting brigade" with Mamata Banerjee during the Bofors controversy and a former Union Minister in the P.V. Narasimha Rao government, Surendrajeet Singh Ahluwalia is also a linguist.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X