శబరిమల అయ్యప్ప దర్శనంలో మార్పులు - ఇక నేరుగా, బ్రిడ్జి తొలిగింపు..!!

అయ్యప్ప భక్తులకు శబరిమల దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. అయ్యప్ప దర్శన విధానంలో కీలక మార్పులను ప్రవేశ పెడుతోంది. ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర పద్దెనిమిది మెట్లు ఎక్కగానే, అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఇంతకు ముందు పదునెట్టాంబడి ఎక్కిన తరువాత ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. ఇక, ఇప్పుడు ఆ బ్రిడ్జిని తెలిగించాలని డిసైడ్ అయ్యారు. మార్చి 14 నుంచి ఈ నూతన దర్శన విధానం అమల్లోకి తెస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది.

18 మెట్లు ఎక్కగానే
లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు సన్నిధానం లో ఇక అయ్యప్ప దర్శనం నేరుగా జరగనుంది. ఈ మేరకు కొత్తగా మార్పులు చేసారు. ఇప్పటి వరకు ఇరుముడితో వచ్చే భక్తులను పదునెట్టాంబడి ఎక్కగానే ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి ఆలయం చుట్టూ.. సుమారు 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా.. సన్నిధానాన్ని చేరుకోవాల్సి వచ్చేది. శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా.. అధికారులు కొత్త లేఅవుట్‌ను డిజైన్ చేయగా.. ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర పద్దెనిమిది మెట్లు ఎక్కగానే.. అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతించనున్నారు.

Sabarimala has introduced a new darshan system change will come into effect on March 14

తాజా మార్పులు
మార్చి 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తారు. ఆ సీజన్‌లో ఇరుముడితో వెళ్లే భక్తులు.. 18 మెట్లు ఎక్కగానే.. నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా రెండు లేదా నాలుగు లైన్లను ఏర్పాటు చేస్తారు. భక్తులు బలికల్‌పుర(కణిక్క వంచి-నైవేద్య పాత్ర) మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు. ఇంతకు ముందు ఫ్లైఓవర్‌ దిగాక.. అయ్యప్ప సన్నిధి ఎడమ వైపు నుంచి దర్శనం లభించేది. దీంతో, సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే రెండు లేదా మూడు సెకన్ల పాటు అయ్యప్ప దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు
దర్శనం సరిగ్గా జరగలేదనే బాధ భక్తుల్లో కనిపించేది.

మార్చి 14 నుంచి అమలు
తాజా మార్పులతో కణిక్కవంచి నుంచి వెళ్లేప్పుడు 30 సెకన్ల నుంచి నిమిషం వరకు అలా అయ్య ప్పను దర్శించుకుంటూ ముందుకు సాగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం శబరి మలలో కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. 17వ తేదీ నుంచి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి తొలగింపు, ఇతర అభివృద్ధి పనులను చేపడతారు. హైకోర్టు కూడా కొత్త ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది. హైకోర్టు నియమించిన శబరిమల ప్రత్యేక కమిషన ర్‌ పర్యవేక్షణలో పనులు ప్రారంభమవుతాయి. కాగా.. ప్రస్తుతం ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని భక్తుల రద్దీ నేపథ్యంలో 1989లో ఏర్పాటు చేశారు. మార్చి 14 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+