బోల్తా పడ్డ అయ్యప్ప స్వాముల బస్సు..: ఇతర రాష్ట్రాల డ్రైవర్లకు కేరళ పోలీసుల సూచనలు

Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. డిసెంబర్ 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. మకరవిళక్కు కోసం మళ్లీ 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. ఈ 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకుంది. తొలి వారంలోనే అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 14 లక్షలు దాటింది.

భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇటీవలే కర్ణాటకలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప స్వాములు మరణించారు. వారిని చెన్నైకి చెందిన గోపీ, గౌతమ్ రమేష్, హరిహరన్, జయంకర్ గా గుర్తించారు. కర్ణాటక కోలార్‌ జిల్లాలోని మాలూరు తాలూకా అబ్బేనహళ్లి సమీపంలో బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Sabarimala Pilgrims Hurt in Idukki Bus Accident

ఇప్పుడు తాజాగా తమిళనాడుకే చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తోన్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. కొల్లం-తేని జాతీయ రహదారిపై ఇడుక్కి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 50 మంది అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. వారిలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.

50 మంది అయ్యప్ప స్వాములతో తమిళనాడులోని దిండిగల్ నుండి శబరిమలకు బయలుదేరి వెళ్లిన బస్సు అది. తెల్లవారు జామున 5:45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఇడుక్కి జిల్లాలోని కొట్టక్కాణం సమీపంలో మలుపులో బోల్తా పడింది. డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో విఫలం కావడం వల్లే ప్రమాదానికి కారణమని పీర్‌మేడ్ స్టేషన్ పోలీసులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను కొట్టాయం జిల్లాలోని ముండకాయంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సు డ్రైవర్లు కేరళ ఘాట్ రోడ్లల్లో జాగ్రత్తగా వాహనాలను నడిపించాలని, అతివేగం కారణంగా జాతీయ రహదారిలో మలుపులను సరిగా అంచనా వేయలేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+