Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, చర్చలు పూర్తి, ఆ రూల్స్ పాటించాలి, శబరిమలలో బుకింగ్ చాన్స్!

శబరిమల/ పతనంమిట్ట/ పంపా: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు తీపి కబురు ఈరోజు చెబుతాం, రేపు చెబుతాం అంటూ కేరళ ప్రభుత్వం ఆశలు చూపిస్తోంది. నవంబర్ 30వ తేదీ కార్తీక మూడో సోమవారం అయ్యప్పస్వామి భక్తులకు కచ్చితంగా తీపి కబరు చెబుతామని శబరిమల అయ్యప్పస్వామి ఆలయ కమిటి బోర్డు (దేవస్వం) అధ్యక్షుడు ఎన్. వాసు అన్నారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, ఓ నిర్ణయం తీసుకుంటామని శబరిమల దేవస్వం బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు చెప్పారు. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా శబరిమలలో బుకింగ్ పాయింట్ ప్రారంభం కానుంది.

Recommended Video

    #SabarimalaTemple: శబరిమల వెళ్లకున్నా స్వామి పూజలు , ఇరుముడుల సమర్పణకు ఏర్పాట్లు |AP Ayyappa Temples

     కేరళ ప్రభుత్వంతో చర్చలు

    కేరళ ప్రభుత్వంతో చర్చలు

    శబరిమలకు ప్రస్తుతం అయ్యప్పస్వామి భక్తులు వెళ్లే సంఖ్య చాలా తక్కువకు పడిపోయింది. కరోనా వైరస్ (COVID-19) నియమాలు చాలా కఠినంగా ఉండటంతో చాలా మంది అయ్యప్పస్వామి భక్తులు వారి సొంత రాష్ట్రాల్లోని అయ్యప్ప ఆలయాల్లోనే దీక్షను విరమిస్తున్నారు. ఈ సందర్బంలో కేరళ ప్రభుత్వంతో అయ్యప్పస్వామి దేవస్వం కమిటీ చర్చించింది.

    మీరే ఆలోచించండి!

    మీరే ఆలోచించండి!

    ప్రస్తుతం శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి కేవలం వెయ్యి మంది అయ్యప్ప భక్తులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. శనివారం, ఆదివారం రోజుల్లో రెండు వేల మంది అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే ప్రతిరోజూ శబరిమలలోని అయ్యప్ప సన్నిధానంలోకి కనీసం 5 వేల మంది భక్తులకు అవకాశం ఇవ్వాలని అయ్యప్ప ఆలయ కమిటీ బోర్డు కేరళ ప్రభుత్వానికి పదేపదే మనవి చేస్తూనే ఉంది.

    అయ్యప్ప భక్తులకు ఈ రోజు గుడ్ న్యూస్

    అయ్యప్ప భక్తులకు ఈ రోజు గుడ్ న్యూస్

    శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు కార్తీక మూడవ సోమవారం (నవంబర్ 30వ తేదీ) కచ్చితంగా గుడ్ న్యూస్ చెబుతామని శబరిమల దేవస్వం బోర్డు అధ్యక్షుడు వాసు అన్నారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వంతో చర్చించాం, ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకున్ని సన్నిధానంలో అయప్పను దర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని దేవస్వం బోర్డు అధ్యక్షుడు వాసు అంటున్నారు.

    శబరిమలలో అయ్యప్ప భక్తులకు బుకింగ్ పాయింట్

    శబరిమలలో అయ్యప్ప భక్తులకు బుకింగ్ పాయింట్

    సోమవారం నుంచి అయ్యప్ప భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకోసం శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం బుకింగ్ పాయింట్ ( అయ్యప్ప స్వామి దర్శానికి అనుమతి కోసం రిజిస్ట్రేషన్) ప్రారంభిస్తామని, అందుకోసం నీలక్కల్ లో చరుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు రావడానికి కచ్చితంగా అవకాశం ఇస్తామని దేవస్వం బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు అన్నారు.

    కోవిడ్ నియమాలు పాటించాల్సిందే

    కోవిడ్ నియమాలు పాటించాల్సిందే

    శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులు కచ్చితంగా కోవిడ్ నియమాలు పాటించాలని వాసు మనవి చేశారు. కోవిడ్ ప్రోట్ కాల్ ప్రకారం శబరిమలలోకి అయ్యప్ప భక్తులు వెళ్లడానికి అవకాశం ఇస్తామని వాసు స్పష్టం చేశారు. కోవిడ్ నియమాలు పాటించకుండా నిర్లక్షం చేసే శబరిమల అధికారులు, ఉద్యోగులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్, వాసు హెచ్చరించారు.

    13, 529 మంది భక్తులు మాత్రమే

    13, 529 మంది భక్తులు మాత్రమే

    శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల తీర్థయాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఆదివారం వరకు 13, 529 మంది అయ్యప్ప భక్తులు శబరిమలలోని సన్నిధానం చేరుకుని స్వామిని దర్శించుకున్నారని వాసు స్పష్టం చేశారు. శబరిమలకు వచ్చిన అయ్యప్ప భక్తులో 33 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని వెనుతిరిగిన వారిలో ఇంత వరకు ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని శబరిమల దేవస్వం బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు స్పష్టం చేశారు. మొత్తం మీద ఈ రోజు నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+