వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
For Daily Alerts
Oneindia App Download

సచిన్ దత్తత తీసుకున్న గ్రామం ఆంధ్రాలో ఎక్కడ

By Nageswara Rao

Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఓ గ్రామాన్ని దత్తతు తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న ఆ గ్రామం పేరు పుత్తరాజుకండ్రిక. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సవాల్‌ను స్వీకరించిన సచిన్ ఈ గ్రామాన్ని 'సన్‌సద్ ఆదర్శ్ గ్రామ్ యోచన' క్రింద ఈ గ్రామాన్ని దత్తతు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ గ్రామాన్ని రూ. 3.50 కోట్ల నిధులతో అభివృద్ది చేయనున్నట్లు సచిన్ ప్రకటించారు. ఈ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు.

నవంబర్ 16వ తేదీన సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని సందర్శించి అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పుత్తరాజుకండ్రిక గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్‌ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలను నిర్మిస్తారు.

Sachin Tendulkar Adopts Village, PM Narendra Modi Delighted

తాను తీసుకున్న నిర్ణయం గురించి ప్రధాని నరేంద్రమోడీని గురువారం సతీసమేతంగా కలిసి సచిన్ టెండూల్కర్ వివరించారు. ప్రధాని మోడీ... సచిన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ను మరింత విస్తరించాలని సచిన్ టెండూల్కర్ నరేంద్రమోడీని కోరారు.

I am delighted to know that the sporting legend will adopt a village under Saansad Adarsh Gram Yojana. @sachin_rt
— Narendra Modi (@narendramodi) October 16, 2014

Met @sachin_rt. He talked about his contribution towards Swachh Bharat Abhiyaan. His efforts towards a Clean India are phenomenal!
— Narendra Modi (@narendramodi) October 16, 2014

English summary
Sachin Tendulkar, sports icon and member of parliament, has decided to adopt a village and work on developing its infrastructure, a goal the Prime Minister asked all law-makers to embrace in his speech on Independence Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X