తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినవారిని తొలగించాలి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందినవారిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.ఆయాశాఖల్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినవారి సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది.

ఎస్ సి, ఎస్టీ, బిసి సామాజికవర్గాలకు చెందిన నకిలీ ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన వారిని ఆయా ఉద్యోగాలనుండి వెంటనే తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలను జారీచేసింది.

Sack employees who got jobs with fake caste certificates: Govt

ఆయా రాష్ట్రాల్లోని వివిధ శాఖల్లో నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందినవారి సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం కోరింది.

నకిలీ కుల దృవీకరణపత్రాలతో సుమారు 1800 మంది ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు పొందారని అధికారికంగా వెల్లడైన సమాచారం ఆధారంగా స్పష్టమైంది.బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్లలో ఎక్కువగా నకిలీ ధృవీకరణపత్రాలతో ఉద్యోగాలు సంపాదించారని నివేదిక వెల్లడిస్తోంది.

తప్పుడు సమాచారం ఆధారంగా లేదా తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలను పొందితే వారిని ఉద్యోగాల్లో కొనసాగించకూడదనేది ప్రస్తుతం ఉన్న నిబంధనలు చెబుతున్నాయి.ఈ నిబంధనల ఆధారంగా తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలను పొందినవారిని తొలగించాలని సర్కార్ ఆదేశాలను జారీ చేసింది.

తప్పుడు ధృవీకరణ పత్రం, లేదా నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన విషయాన్ని ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినప్పుడు సదరు ఉద్యోగులను వెంటనే విధుల్లో నుండి తప్పించవచ్చని డిఓపిటి డైరెక్టర్ స్పష్టం చేశారు.

నకిలీ, తప్పుడు ధృవీకరణ పత్రాల ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారి సమాచారాన్ని సేకరించి వారి సమాచారాన్ని సేకరించాలని కేంద్రం అన్ని శాఖలను ఆదేశించింది.

దీంతో కేంద్రంలోని అన్ని మంత్రిత్వశాఖలు రిజర్వేషన్ల ద్వారా భర్తీచేసిన పోస్టులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఎస్ సి, ఎస్టీ, బిసి రిజర్వేషన్ల సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలను పొందినవారు ఎవరెవరున్నారు. వారు సమర్పించిన సర్టిఫికెట్లు సక్రమమేనా అనే కోణంలో ఆరాతీస్తున్నారు.

నకిలీ సర్టిఫికెట్లు, తప్పుడు ధృవీకరణ పత్రాలను ఆధారంగా 1832 ఉద్యోగాలను పొందారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ లోక్ సభకు ఈ ఏడాది మార్చి29న, రాతపూర్వక సమాధానాన్ని ఇచ్చారు.

అయితే ఇందులో 276మందిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు.521 మంది క్రమశిక్షణ చర్యలను తీసుకొన్నట్టు చెప్పారు. 1,035 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

తప్పుడు ధృవీకరణ పత్రాలు, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టుగా 1296 కేసులున్నట్టుగా ఆయన చెప్పారు. ఎస్ బి ఐ లో 157 కేసులు, 135 సెంట్రల్ బ్యాంకులో, 112 మంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో, 103 మంది సిండికేట్ బ్యాంకులో , 41 మంది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ లో ఉద్యోగాలు సంపాదించారని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Employees who got jobs using forged scheduled or backward caste certificates will be dismissed, the Centre has said.
Please Wait while comments are loading...