వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రద్దు: చెత్తకుప్పల్లో పడేసి రూ.500, 1000నోట్లను కాల్చేశారు!

|
Google Oneindia TeluguNews

బరైలీ: రూ. 500, 1000 నోట్ల రద్దుతో కొందరు అవగాహన లేక ఆందోళన చెందుతుంటే.. మరికొందరు ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని భయపడుతున్నారు. కొందరు ఎవరికీ తెలియకుండా ఆ నోట్లను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఓ కంపెనీ కార్మికులు రూ.500, రూ.1000 నోట్లను బస్తాల్లో తెచ్చి గుట్టలుగా కుమ్మరించి కాల్చి బూడిదచేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Sacks Full Of Burnt 500 And 1,000 Rupee Notes In Uttar Pradesh

నోట్లను ముందు చించేసి తర్వాత దహనం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో కంపెనీ యాజమాన్యాన్ని విచారించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. నల్లధనం నియంత్రణకు మంగళవారం రాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దుచేస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రకటనతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాము దాచుకున్న నల్లధనాన్ని ఏం చేయాలో తెలీక వారంతా ఆలోచనలో పడ్డారు. కొందరు దీన్ని తప్పించుకోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

English summary
A day after the government discontinued Rs. 500 and 1000 notes in a shock announcement to curb black money, sacks full of burnt notes were found in Bareilly in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X