Sadist: భార్య మీద తాగుబోతు భర్తకు డౌట్, ఆహారంలో విషం కలిపి ?, నలుగురు పిల్లలు!
బరేలి/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత కూడా భర్త అతని భార్యను సంతోషంగా చూసుకున్నాడు. రానురాను భర్త మద్యంకు బానిస అయ్యాడు. ఇదే సమయంలో పిల్లలను పోషించడానికి భార్య ఉద్యోగం చెయ్యడానికి బయటకు వెలుతోంది. బయట తిరుగుతున్న భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త అతని భార్య దగ్గర డబ్బులు తీసుకుని మద్యం సేవిస్తూ జల్సా చేస్తున్నాడు. పిల్లలను పోషించడమే కాకుండా భర్త లిక్కర్ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక భార్య నానా ఇబ్బందులు ఎదుర్కొనింది. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవపెట్టుకుని ఆమెను చితకబాదేశాడు.
తరువాత బయటకు వెళ్లిన భర్త అతని భార్య, పిల్లలకు తినడానికి ఆహారం తీసుకువచ్చాడు. భర్త తెచ్చిన ఆహారం భార్యతో పాటు నలుగురు పిల్లలు తిన్నారు. తల్లి, ఆమె నలుగురు పిల్లలు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. మద్యం మత్తులో ఉన్న భర్త తలకు నిషా ఎక్కిపోవడంతో నిద్రపోయాడు. సరైన సమయంలో విషయం గుర్తించిన స్థానికులు తల్లి, ఆమె నలుగురు పిల్లలను ఆసుపత్రికి తరలించారు.

నలుగురు పిల్లలు
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని దిలారీ ప్రాంతంలో అర్జున్ కాశ్యప్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 16 సంవత్సరాల క్రితం శకుంతల అనే మహిళను అర్జున్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అర్జున్, శకుంతల దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. శకుంతల అర్జున్ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు.

భార్య మీద తాగుబోతుకు డౌట్
పిల్లలు పుట్టిన తరువాత కూడా అర్జున్ అతని భార్య శకుంతలను చాలా సంతోషంగా చూసుకున్నాడు. రానురాను అర్జున్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ఇదే సమయంలో పిల్లలను పోషించడానికి శకుంతల ఉద్యోగం చెయ్యడానికి బయటకు వెలుతోంది. బయట తిరుగుతున్న భార్య శకుంతల మీద ఆమె భర్త అర్జున్ కు అనుమానం మొదలైయ్యింది.

భార్యకు టార్చర్ పెట్టి డబ్బు లాగేస్తున్న భర్త
నువ్వు ఎక్కడికి వెలుతున్నావు ?, ఎవరితో మాట్లాడుతున్నావు ? అంటూ అర్జున్ అతని భార్య శకుంతలను సూటిపోటి మాటలతో హింసించడం మొదలుపెట్టాడు. భార్య శకుంతల మీద అనుమానం పెంచుకున్న అర్జున్ అతని భార్య దగ్గర డబ్బులు తీసుకునివెళ్లి మద్యం సేవిస్తూ జల్సా చేస్తున్నాడు.

భార్య మీద కోపంతో అందరికి విషం కలిపి పెట్టిన శాడిస్టు
పిల్లలను పోషించడమే కాకుండా భర్త అర్జున్ లిక్కర్ పార్టీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక శకుంతల నానా ఇబ్బందులు ఎదుర్కొనింది. రాత్రి ఇంటికి వెళ్లిన అర్జున్ మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వాలని అతని భార్య శకుంతలతో గొడవపెట్టుకుని ఆమెను చితకబాదేశాడు. తరువాత బయటకు వెళ్లిన అర్జున్ అతని భార్య, పిల్లలకు ఇష్టమైన ఆహారం తీసుకుని అందులో విషం కలిపి ఇంటికి తీసుకెళ్లి అతని భార్య, పిల్లలకు తినడానికి ఇచ్చాడు.

ఐసీయూలో ఐదు మంది
భర్త అర్జున్ తీసుకెళ్లిన ఆహారం అతన్ని భార్య శకుంతలతో పాటు నలుగురు పిల్లలు తిన్నారు. శకుంతల, ఆమె నలుగురు పిల్లలు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. మద్యం మత్తులో ఉన్న అర్జున్ అస్వస్థతకు గురై భార్య, పిల్లలు పడిపోయారని గుర్తించినా పట్టించుకునే ఓపికలేకపోవడం, తలకు నిషా ఎక్కిపోవడంతో వాళ్ల పక్కనే నిద్రపోయాడు.
విషయం గుర్తించిన స్థానికులు శకుంతల, ఆమె నలుగురు పిల్లలను ఆసుపత్రికి తరలించారు. తన భార్య శకుంతల మీద కోపం ఆహారంలో విషం కలిపి ఇంటికి తీసుకెళ్లి భార్యకు ఇచ్చానని, పొరపాటును పిల్లలు కూడా ఆఆహారం తినేశారని అర్జున్ విచారణలో అంగీకరిచాడని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అనూప్ సింగ్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications