Sadist: కాలేజ్ లో లెక్చరర్, ఐదు ఏళ్లు భార్యను రూమ్ లో పెట్టి లాక్ చేసి ఏం చేశాడంటే ?, చివరికి !
రాజ్ కోట్/ గుజరాత్: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో మొదట్లో సంతోషంగా కాపురం చేశాడు. రానురాను భార్యను టార్చర్ పెడుతున్న భర్త ఆమెకు నరకం చూపించాడు. మొదట కాలేజ్ లో తాత్కాలిక లెక్చరర్ గా ఉద్యోగం చేసిన అతను తరువాత ప్రభుత్వ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం సంపాధించాడు. కాలేజ్ లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఆ లెక్చరర్ ఇంట్లో భార్యకు నరకం చూపించడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

16 ఏళ్ల క్రితం పెళ్లి
గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాలోని తాళజా పట్టణంలో దేవ్ జీ మారు (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 16 సంవత్సరాల క్రితం హంసా (37) అనే మహిళను దేవ్ జీ వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకునే సమయంలో దేవ్ జీ ఓ కాలేజ్ లో రూ. 2,500 జీతానికి లెక్చరర్ గా ఉద్యోగం చేసేవాడు. దంపతులకు 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు.

ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది
ఆ సమయంలో హంసా కుటుంబ సభ్యులు ప్రతినెల వాళ్ల కాపురానికి అవసరం అయ్యే డబ్బులు, సరుకులు తీసిచ్చారు కొన్ని సంవత్సరాల తరువాత గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలు రాసిన దేవ్ జీ ప్రభుత్వ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం సంపాధించాడు. వేల రూపాయల జీతం తీసుకుంటున్న దేవ్ జీ అతని భార్య హంసాకు మాత్రం నరకం చూపించాడు.

వారంలో రెండు రోజులు భార్యకు ఆహారం
ఇంట్లోనే ఒక రూమ్ లో భార్య హంసాను నిర్బంధించిన దేవ్ జీ ఆమెకు సక్రమంగా ఆహారం పెట్టకుండా శరీరారకంగా చిత్రహింసలకు గురి చేశాడు. వారంలో రెండు రోజుల మాత్రమే ఆహారం పెట్టడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. విషయం తెలుసుకున్న హంసా కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

టార్చర్ ఎక్కువ అయ్యింది......ప్రాణం పోయింది
ఆసుపత్రికి వెళ్లిన దేవ్ జీ అతని భార్య హంసాను డిశ్చార్జీ చేసుకుని మళ్లీ ఇంటికి పిలుచుకుని వెళ్లి రూమ్ లో నిర్బంధించాడు. ఆహారం లేకపోవడంతో ఇప్పటికే తీవ్ర అనారోగ్యానికి గురైన హంసా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హంసా సోదరులు నలుగురు ఇప్పటికే లక్షలు లక్షలు డబ్బులు దేవ్ జీవి ఇచ్చారని, హంసా నగలు మొత్తం విక్రయించి అతను జల్సాలు చేశాడని హంసా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు శాడిస్టు లెక్చరర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications