Reject: ఇన్సూరెన్స్ కంపెనీ మూడో అంతస్తు నుంచి యువతిని తోసి చంపేసిన మాజీ బాయ్ ఫ్రెండ్ !
లక్నో/నోయిడా: చాలాకాలం నుంచి ఓ అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉన్నారు. యువకుడు, యువతి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే అమ్మాయి మాత్రం ఆమె స్నేహితుడితో చనువుగా ఉండటం లేదు. తనను ప్రేమించాలని యువకుడు అతని స్నేహిరాలిని వేధించాడు. నువ్వునాకు ఫ్రెండ్ మాత్రమే, ప్రియుడు కాదని ఆమె తేల్చి చెప్పింది. మాజీ గర్ల్ ఫ్రెండ్ ఉద్యోగం చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరకు మాజీ బాయ్ ఫ్రెండ్ వెళ్లాడు. మూడో అంతస్తు మీద ఉన్న యువతితో ప్రేమ విషయంలో గొడవపడ్డాడు. అమ్మాయి ప్రేమించనని తేల్చి చెప్పడంతో రగిలిపోయిన శాడిస్టు ఆమెను పై నుంచి కిందకు తోసేసి చంపేశాడు. నేను ఆమె అన్న అని, ఆసుపత్రికి పిలుచుకుని వెలుతానని కంపెనీ సిబ్బందికి చెప్పిన శాడిస్టు యువతి శవాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లి అంత్యక్రియలు చెయ్యడానికి విఫలయత్నం చేశాడు.

యువతి, యువకుడు ఫ్రెండ్స్
నోయిడాలోని సెక్టెర్ 71లోని ల్యాబ్ లో గౌరవ్ అనే యువకుడు ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం బిజ్నోర్ కు చెందిన శీతల్ అనే యువతి గౌరవ్ కు పరిచమం అయ్యింది. అప్పటి నుంచి గౌరవ్ తో శీతల్ స్నేహంగా ఉంటున్నది. శీతల్ ను గౌవర్ ప్రేమించాడు. గౌరవ్ ది వన్ వే లవ్.

ఉద్యోగం చేస్తున్న శీతల్
ఉత్తరప్రదేశ్ లోని హోశియాపూర్ లోని శర్మామార్కెట్ లోని ఇన్సూరెన్స్ కంపెనీలో శీతల్ ఉద్యోగం చేస్తున్నది. శీతల్ ఉద్యోగం చేస్తున్న కంపెనీ మూడో అంతస్తులో ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వుకూడా నన్ను ప్రేమించాలని గౌరవ్ అతని స్నేహితురాలు శీతల్ మీద ఒత్తిడి చేశాడు. నువ్వునాకు ఫ్రెండ్ మాత్రమే, నేను నిన్ను ప్రేమించలేదని శీతల్ ఆమె ఫ్రెండ్ గౌరవ్ కు తేల్చి చెప్పింది.

పోలీసు కేసు పెట్టిన అమ్మాయి
శీతల్ ప్రేమించనని చెప్పినా గౌరవ్ ఆమె వెంటపడ్డాడు. రానురాను గౌరవ్ వేధింపులు ఎక్కువ కావడంతో శీతల్, ఆమె కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 29వ తేదీన పోలీసు కేసు పెట్టారు. పోలీసులు గౌరవ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ముందు శీతల్ వెంటపడనని, ఆమెతో మాట్లాడనని, టార్చర్ పెట్టనని గౌరవ్ పోలీసుల ముందు హామీ ఇవ్వడంతో కేసు లేకుండా అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.

పని చేస్తున్న కంపెనీలో ?
శీతల్ ఉద్యోగం చేస్తున్న కంపెనీ దగ్గరకు గౌరవ్ వెళ్లాడు. మూడో అంతస్తు మీద ఉన్న శీతల్ తో ప్రేమ విషయంలో గౌరవ్ గొడవపడ్డాడు. నేను నిన్ను ప్రేమించనని, ఇంకోసారి వెంటపడితే మళ్లీ పోలీసు కేసు పెడుతానని శీతల్ తేల్చి చెప్పింది. ఆ సందర్బంలో రగిలిపోయిన శాడిస్టు గౌరవ్ శీతల్ ను ఆమె పని చేస్తున్న కంపెనీ మూడో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు.

అంత్యక్రియలు చెయ్యడానికి స్కెచ్
మూడో అంతస్తు నుంచి కందపడిపోయిన శీతల్ తల పగిలిపోయింది. నేను శీతల్ కు అన్న అని, ఆమెను ఆసుపత్రికి పిలుచుకుని వెలుతానని కంపెనీ సిబ్బందికి చెప్పిన గౌరవ్ ఆమెను అంబులెన్స్ లో తీసుకెళ్లాడు. కొంతసేపటికే శీతల్ చనిపోయింది. శీతల్ శవాన్ని అంబులెన్స్ తీసుకుని వెలుతూ ఆమె అంత్యక్రియలు చెయ్యడానికి గౌరవ్ విఫలయత్నం చేశాడు.

అంబులెన్స్ తో సహ చిక్కిపోయిన కిరాతకుడు
అంబులెన్స్ లో వెలుతున్న గౌరవ్ గాజియాబాద్ పోలీసులకు చిక్కిపోయాడు. పోలీసులు ఆరోజు గౌరవ్ ను అరెస్టు చేసి ఉంటే తన సోదరి ప్రాణాలు ఉండేవని, పోలీసులు ఆరోజు గౌరవ్ తో డీల్ మాట్లాడుకుని అతన్ని వదిలేశారని శీతల్ సోదరుడు కునాల్ ఆరోపిస్తున్నాడు. శీతల్ ను తానే హత్య చేశానని గౌరవ్ అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications