వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొవిడ్ వ్యాక్సిన్‌పై పుకార్లు నమ్మొద్దు -సేఫ్టీకే తొలి ప్రాధాన్యం -టీకా డ్రైరన్ వేళ ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ కోసం సన్నహకాల్లో భాగంగా శనివారం నాడు దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్‌ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ మాక్‌ డ్రిల్‌ ఈ ఉదయం నుంచి మొదలైంది. డమ్మీ వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరునుఅధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన టీకా మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ స్వయంగా వెళ్లి పరిశీలించారు.

Safety of vaccine the prime concern,says Health Minister, visits Delhi hospital as dry run begins

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ విషయంలో పుకార్లని నమ్మొద్దని ప్రజలను కోరారు. వ్యాక్సిన్ సేఫ్టీ, సమర్థతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని స్పష్టం చేశారు. గతంలో పోలియో వ్యాక్సిన్ సమయంలోనూ ఇలాంటి రూమర్లే వ్యాపించాయని, వాటిని నమ్మకుండా ప్రజలంతా టీకాలు తీసుకోడానికి ముందుకొచ్చారిన ఆయన గుర్తుచేశారు.

 సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి

Safety of vaccine the prime concern,says Health Minister, visits Delhi hospital as dry run begins

ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించడంతో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను గైడ్ లైన్స్ లో చేర్చామని, శనివారం నాటి దేశవ్యాప్త డ్రైరన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతున్నదని ఆరోగ్య మంత్రి తెలిపారు. అసలైన వ్యాక్సిన్ ఇవ్వడం తప్ప, మిగతా ప్రక్రియ అంతా సజావుగా సాగుతోందన్నారు. వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ముందు ప్రజలు, ఆరోగ్యసిబ్బంది పాటించాల్సిన అంశాలు, టీకా ఇచ్చాక ఏవైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణం అందించాల్సిన చికిత్స గురించి డ్రైరన్‌ మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

భారత్‌లో కరోనా: తొలిరోజు గుడ్‌న్యూస్ -1కోటి రికవరీలు-కొత్తగా 19,079 కేసులు, 224మరణాలు-వ్యాక్సిన్ డ్రైరన్ షురూభారత్‌లో కరోనా: తొలిరోజు గుడ్‌న్యూస్ -1కోటి రికవరీలు-కొత్తగా 19,079 కేసులు, 224మరణాలు-వ్యాక్సిన్ డ్రైరన్ షురూ

Safety of vaccine the prime concern,says Health Minister, visits Delhi hospital as dry run begins

భారత్ లో అత్యవసర వినియోగానికిగానూ సీరం-ఆక్స్ ఫర్డ్ సంస్థలు అభివృద్ది చేసిన 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ కు కేంద్ర నిపుణుల బృందం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీడీసీఐ తుది ఆదేశాల తర్వాత 'కొవిషీల్డ్' వినియోగంలోకి రానుంది. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ రూపొందించిన 'కొవాగ్జిన్' వ్యాక్సిన్ కు సైతం త్వరలోనే ఆమోదం లభించనున్నట్లు సమాచారం. ఈ రెండు వ్యాక్సిన్లను వచ్చే వారం నుంచే పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

English summary
union Health Minister Harsh Vardhan, who visited the GTB Hospital in Delhi to review a dry run for the COVID-19 vaccination, said that the “safety of vaccine is the prime concern." Indiago for the COVID-19 vaccination mock drill and the dry run by all the States and UT governments on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X