వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ ఎన్నికల్లో సజ్జాద్ లోన్ విజయం: భార్య పాకిస్తానీ

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: మాజీ వేర్పాటువాద నాయకుడు సజ్జాద్ లోన్ ఉత్తర కాశ్మీర్‌లోని హంద్వారా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 47 లోన్ తొలిసారి హంద్వారా నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆయన పీపుల్స్ కాన్ఫరెన్స్ పోటీ చేసింది.

తమ ప్రజకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఇది తనకు సవాల్ అని, ప్రతి ప్రశ్నకు తాను సమాధానం ఇచ్చానని, తాను తన శాసనసభ్యులు అభివృద్ధి కోసం పనిచేస్తామని, శానససభ్యులకు ప్రజలు భయపడకూడదని ఆయన అన్నారు.

తన తండ్రి అబ్దుల్ గనీ లోన్ స్థాపించిన పీపుల్స్ కాన్ఫరెన్స్‌ను సజ్జాద్ లోన్ తిరిగి ప్రారంభించారు. అబ్దుల్ గనీ లోన్ 2002లోలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా శ్రీనగర్‌లో హత్యకు గురయ్యారు. లోన్ పార్టీ కుప్వారా, హంద్వారా ప్రాంతాల్లో 12 స్థానాలకు పోటీ చేసింది. బిజెపికి ఆయన పార్టీ మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది.

Sajjad Lone, Former Separatist With Pakistani Wife, Wins in Kashmir

ప్రజాస్వామ్యంతో ప్రయోగం చేస్తున్న లోన్ 2008 ఎన్నికల్లో తన అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దించారు. 2009 లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బారాముల్లా లోకసభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

సజ్జాద్ లోన్ పాకిస్తాన్‌కు చెందిన అస్మా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వేర్పాటు నాయకుడైన ఆయన తండ్రి అమానుల్లా ఖాన్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌ను స్థాపించారు. ఎన్నికలకు ముందు గత నెలలో సజ్జాద్ లోన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మోడీని తన అన్నయ్యగా చెప్పుకున్నారు. సజ్జాద్ అన్నయ్య బిలాల్ హురయత్ కాన్ఫరెన్స్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు.

English summary
Separatist-turned-mainstream politician Sajjad Lone has won from Handwara in north Kashmir in the state assembly elections, held over five phases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X