స్కూల్లో మరుగుదొడ్లు లేవని టీచర్ల జీతాలు నిలిపివేసిన కలెక్టర్..!

న్యూఢిల్లీ: స్కూల్లో టాయిలెట్లు నిర్మించలేదని టీచర్లకు జీతాలు నిలిపివేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ భార్గవ శనివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించారు.

సర్వ శిక్ష అభియాన్ పథకం కింద సదరు పాఠశాలకు నిధులున్నా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాని విషయాన్ని గూర్తించారు. దీంతో నిధులు ఇచ్చినా ఎందుకు మరుగుదొడ్లు నిర్మించలేదని టీచర్లపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Salaries stopped as teachers failed to make toilets in schools in Shahdol

ప్రభుత్వ ఆదేశాలు పాటించరా అంటూ, టీచర్ల నిర్లక్ష్యమే కారణమని తెలుసుకుని వెంటనే పాఠశాలకు చెందిన 25 మంది టీచర్ల వేతనాలను నిలిపివేయాలని సంబంధింతి అధికారులకు అదేశాలు జారీ చేశారు.

తన కార్యాలయం నుంచి తదుపరి ఆదేశాలు జారీ అయ్యేదాకా వారి వేతనాలు విడుదల చేయరాదని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో షాడోల్ జిల్లాలోని షోహాగ్పూర్ బ్లాక్‌లో 10 మంది, గోపారు బ్లాక్‌లో నలుగురు, బుదార్లో ముగ్గురు, బెవ్హరి ఇద్దరు, జైసింగ్నగర్ ఆరుగురి ఉపాధ్యాయుల వేతనాలు ఆపేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+