బిగ్ రిలీఫ్.. : వణ్యప్రాణుల కేసులో నిర్దోషిగా సల్మాన్

Subscribe to Oneindia Telugu

జైపూర్ : కృష్ణజింకల వేట కేసుకు సంబంధించి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ సోమవారం నాడు తీర్పు వెలువరించింది రాజస్తాన్ హైకోర్టు. సల్మాన్ పై నమోదయిన రెండు అభియోగాలను పరిశీలించిన జోధ్ పూర్ హైకోర్టు బెంచ్ రెండు కోసుల నుంచి సల్మాన్ ను విముక్తి చేసింది.

అంతకుముందు సల్మాన్ ను నేరస్తుడిగా ప్రకటిస్తూ దిగువ కోర్టు తీర్పు వెలువరించడంతో.. ఆ తీర్పును సవాల్ ను చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు సల్మాన్. దుప్పి మరియు జింకలను వేటాడి చంపిన రెండు వేర్వేరు కేసుల్లొ సల్మాన్ తో పాటు మరో ఏడుగురు నిందితులు కూడా ఉన్నారు.

Salman Khan acquitted in Blackbuck and Chinkara cases

సంశయ ప్రయోజనం కింద కేసును విచారిస్తున్న క్రమంలో సల్మాన్ ఖాన్ నిర్దోషితత్వాన్ని హైకోర్టు ఆమోదించింది. ఇకపోతే సల్మాన్ నిర్దోషిగా బయపడ్డ ఈ కేసు సెప్టెంబర్ 26, 1998లో గోడా ఫామ్స్ లో చోటు చేసుకుంది. ఆ సమయంలో సల్మాన్ నటించిన హమ్ సాత్ సాత్ హైన్ సినిమా తెరకెక్కుతోంది.

వణ్యప్రాణులను చంపిన ఈ రెండు వేర్వేరు కేసుల్లో అంతకుముందు 2006లో జోథ్ పూర్ కోర్ ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల వరకు శిక్షను ఖరారు చేయగా.. తాజా తీర్పు ఆయనకు భారీ ఊరటనిచ్చింది. జోథ్ పూర్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్టు తుది తీర్పులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించింది. కేసుకు సంబంధించి గత మే నెలలో వాదనలు ముగియగా, తాజాగా రాజస్తాన్ హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Rajasthan High Court on Monday acquitted actor, Salman Khan in the blackbuck poaching case. The Rajasthan High Court Bench in Jodhpur which was hearing appeals filed by the actor acquitted him in both cases.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X