పాక్ కాల్పులు జరుపుతున్నా.. సల్మాన్ ఖాన్ శాంతిమంత్రం

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ఉగ్రదాడులు, చొరబాట్లు, సరిహద్దుల్లో నిరంతర కాల్పులతో పాకిస్థాన్ భారత్‌పై అప్రకటిత యుద్ధం ప్రకటిస్తున్నప్పటికీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం శాంతిమంత్రమే సరైందని వ్యాఖ్యానించాడు. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డాడు.

తన తాజా చిత్రం ట్యూబ్‌లైట్ ప్రమోషన్ వర్క్‌లో భాగంగా మీడియాతో మాట్లాడాడు. పాకిస్థాన్‌తో భారత్ శాంతి చర్చలు జరపాలన్నారు. యుద్ధం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. యుద్ధం అంటూ జరిగితే రెండువైపులా జనం ప్రాణాలు కోల్పోతారన్నారు.

Salman Khan Bats For Peace With Pakistan, Says Warmongers Should be Sent to Border

యుద్ధం అనేది ఎంతమాత్రం తెలివైన చర్య కాదన్నారు. యుద్ధం కోసం తపించేవారిని ముందు యుద్ధానికి పంపాలన్నారు. యుద్ధం ఒకరోజులో ముగుస్తుందని, యుద్ధమంటూ కలవరించే వాళ్లు మాత్రం కూర్చుని చర్చలకే పరిమితమవుతుంటారన్నారు.

గతంలోనూ సల్మాన్ పాక్ అనుకూల వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఉగ్రవాదం, శాంతి చర్చలు ఒకే ఒరలో ఇమడవని, ఉగ్రవాదానికి స్వస్తి చెబితేనే శాంతి చర్చల ప్రక్రియ ముందుకు వెళ్తుందని భారత్ పదేపదే తేల్చి చెబుతున్నా, సల్మాన్ మరోసారి శాంతి మంత్రం పఠించడం తాజా వివాదానికి తావిచ్చింది.

సల్మాన్ ఖాన్‌పై విరుచుకుపడిన శివసేన

సల్మాన్ మీడియా సమావేశం పూర్తికాగానే ఆయన వ్యాఖ్యలపై శివసేన విరుచుకుపడింది. సల్మాన్ ఖాన్ తన హద్దులు మరిచిపోయాడంటూ తప్పుపట్టింది. సల్మాన్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమని, ప్రతిసారి తన హద్దులు తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతుండటం తాము సహించేది లేదని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ హెచ్చరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Salman Khan has spoken in favour of talks with Pakistan at a time of tension in ties over increased militancy in Kashmir, saying those who demand wars should be sent to the border to end the warmongering.
Please Wait while comments are loading...