రేప్ వ్యాఖ్యలు: క్షమాపణకు మొండికేస్తున్న సల్మాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ తాను చేసిన రేప్ వ్యాఖ్యలపై వ్యక్తిగతంగా హాజరై క్షమాపణలు చెప్పాలని మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లను బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ పట్టించుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పనని అతడు తెలిపాడు.

తన షూటింగ్ సంగతులు ఆన్‌లైన్ ఇంటర్‌వ్యూ ఇచ్చిన ఖాన్ 'అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి షూటింగ్ అయ్యాక తాను ఎదుర్కొన్నాను' అని సల్మాన్ అన్న విషయం తెలిసిందే. సల్మాన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. మహిళలను అవమానించే రీతిలో మాట్లాడిన అతడు క్షమాపణ చెప్పాలని పలు సంస్థలు డిమాండ్ చేశాయి.

Salman Khan rejects to seek apology for his remarks

దీనిపై మహారాష్ట్ర మహిళా కమిషన్ సల్మాన్‌ఖాన్‌కు రెండు సార్లు సమన్లు ఇచ్చింది. వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. రెండోసారి ఇచ్చిన సమన్లను ఖాన్ తిరస్కరించాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోనని సల్మాన్‌ఖాన్ కమిషన్‌కే లేఖ రాశాడు.

తనను క్షమాపణలు అడిగే హక్కు కమిషన్‌కు లేదని అతడు వాదించాడు. సల్మాన్ ఖాన్ లేఖ తమకు అందిందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహక్తర్ వెల్లడించారు. న్యాయనిపుణులతో సంప్రదించిన తరువాత ముందుకెళ్తామని ఆమె అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bollywood actor Salman Khan has rejected to seek apology on his rape rape remarks. He ignored Maharastra women commission summons.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి