Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Salman Khan: సల్మాన్ ఖాన్ కు భద్రత పెంపు- ఎక్స్ నుంచి వై ప్లస్-బిష్ణోయ్ గ్యాంగ్ ముప్పుతో

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలేను కాల్చిచంపిన బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు కూడా ముప్పు పెరుగుతోంది. సిద్ధూ మూసేవాలా తరహాలో సల్మాన్ ఖాన్ ను కూడా అంతమొందించే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందాయి. దీంతో ఆయన భద్రతను వై ప్లస్ కేటగిరీకి పెంచారు.

బిష్ణోయ్ లకు కృష్ణజింకలంటే అమితమైన ప్రేమ. వాటిని పవిత్ర జంతువుగా భావిస్తుంటారు. అలాంటి కృష్ణ జింకల్ని వేటాడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్దూ మూసేవాలాను ఇప్పటికే హతమార్చిన బిష్ణోయ్ గ్యాంగ్.. ఇప్పుడు సల్మాన్ పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో సల్మాన్ ఖాన్ కు ఈ గ్యాంగ్ నుంచి ప్రాణహానీ పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ కు ఇప్పటికే కల్పిస్తున్న ఎక్స్ కేటగిరీ స్ధానంలో ఇకపై వై ప్లస్ కేటగిరీ కింద అదనపు భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

 Salman Khans security cover enchanced from X to Y plus Now with bishnoi gang threat

తాజా నిర్ణయంతో సల్మాన్ ఖాన్ చుట్టూ అన్ని సమయాల్లో ఇద్దరు సాయుధ గార్డులు కాపలా ఉంటారు. అంతేకాకుండా ఆయన నివాసంలో 24 గంటలూ ఇద్దరు గార్డులు ఉంటారు. సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు రావడంతో ముంబై పోలీస్ ప్రొటెక్షన్ బ్రాంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్ ఉన్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. హత్య చేయడానికి ఈ ముఠాలోని సభ్యులు ఆయన ఫామ్‌హౌస్ వెలుపల రెక్కీ చేసారని నివేదిక పేర్కొంది. ముంబై పోలీస్ ప్రొటెక్షన్ బ్రాంచ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని Y+కి అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌కు కూడా ఇదే విధమైన కవర్ అందించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+