కూర లేదు.. ఉప్పుతో సరి.. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు చుక్కలు..! (VIDEO)
Recommended Video
లక్నో : మధ్యాహ్న భోజన పథకం పక్కదారి పట్టిందనడానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారం అందించాలనే ఉద్దేశంలో ప్రారంభించిన మిడ్ డే మీల్ పథకం కొన్ని చోట్ల అభాసుపాలవుతోంది. కొందరి కారణంగా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చేలా తయారైంది పరిస్థితి.
ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరు చర్చానీయాంశంగా మారింది. పోషకాహారం ఏమో గానీ ప్రతి నిత్యం అక్కడి విద్యార్థులకు రొట్టెలతో పాటు కూరలు ఇవ్వకుండా అనుసరిస్తున్న విధానం ఆరోపణలకు తావిస్తోంది. తాజా ఆకు కూరలు, విజిటెబుల్స్, గుడ్లు, పాలు అందించి వారిశారీరక ఎదుగుదలకు తోడ్పాటు అందించాల్సింది పోయి వారి జీవితాలలో ఆడుకుంటున్న వైనం వెలుగుచూసింది.

ఒక పూట అన్నం పెడుతూ మరో పూట రొట్టెలు ఇస్తున్నప్పటికీ.. కూరలు మాత్రం ఇవ్వడం లేదట. అంతేకాదు గుడ్లు, అరటిపండ్లు ఇలాంటి పోషకాహార పదార్థాలు కూడా అక్కడి సిబ్బంది స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది ఏ ఒక్క పూటకో జరుగుతుందని భావిస్తే పొరపాటే. గతేడాది నుంచి ఇదే తంతుగా వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
This clip is from a @UPGovt school in east UP's #Mirzapur . These children are being served what should be a 'nutritious' mid day meal ,part of a flagship govt scheme .On the menu on Thursday was roti + salt !Parents say the meals alternate between roti + salt and rice + salt ! pic.twitter.com/IWBVLrch8A
— Alok Pandey (@alok_pandey) August 23, 2019
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న తతంగం విజువల్స్‌తో సహా సదరు యువ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రభుత్వ ఉన్నతాధికారి అనురాగ్ పటేల్ స్పందించారు. విచారణ జరిపించి పాఠశాల హెడ్ మాస్టర్‌తో పాటు గ్రామ పంచాయతీ సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications