వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మీకు సెల్యూట్’: వారికి హెచ్చరిక చేసిన మోడీ

|
Google Oneindia TeluguNews

టోక్యో: దేశ హితం కోసం తీసుకున్న నిర్ణయానికి భారతీయులందరూ సహకరించడంఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా వారందరికి ఆయన సెల్యూట్ చేశారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద శుభ్రత కార్యక్రమమని మోడీ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్‌లో ఉన్న మోడీ.. శనివారం కోబ్‌లో భారతీయులతో మాట్లాడారు.

టోక్యో నుంచి కోబ్‌కు జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలిసి బులెట్‌ రైల్లో వెళ్లారు మోడీ. ఆ తర్వాత అక్కడి భారతీయులతో సమావేశమై ప్రసంగించారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు వల్ల ప్రజలు తొలుత ఇబ్బందులకు గురవుతారని తెలుసని, అయితే దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంచలన నిర్ణయాన్ని అంగీకరించినందుకు ప్రతీ భారతీయుడికి సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. వివాహాలు, శుభకార్యాలు ఉన్న వారు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, మరెన్నో కుటుంబాలు దీని వల్ల రకరకాల ఇబ్బందులు పడుతున్నారు, అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని స్వాగతించిన కోట్లాది భారతీయులకు అభివాదం చేస్తున్నట్లు మోడీ తెలిపారు.

ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజల హితం కోసమేనన్నారు. నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పన్ను ఎగవేతదారులను మాత్రం ప్రభుత్వం ఉపేక్షించదని తేల్చి చెప్పారు.

నోట్ల రద్దుపై ఆందోళన అవసరం లేదని, డిసెంబరు 30 వరకు నగదు మార్పిడి, డిపాజిట్లు చేసుకోవచ్చని తెలిపారు. దేశంతో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. అంతకుముందు మోడీకి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.

వృద్ధాశ్రమంలోని తల్లులు ఆశీర్వదిస్తున్నారు

రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో వృద్ధాశ్రమాల్లోని తల్లులంతా తనను ఆశీర్వదిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తల్లులను వృద్ధాశ్రమాల్లో చేర్పించిన కుమారులు, పెద్దనోట్ల రద్దు తర్వాత వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో రెండున్నర లక్షల రూపాయల కనీస మొత్తం వేశారని చెప్పారు. ఈ తల్లులందరూ తనను ఆశీర్వదిస్తున్నారని చెప్పిన మోడీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తల్లుల్లో ఆనందాన్ని.. కొడుకుల్లో మార్పును తీసుకువచ్చిందన్నారు. ఇక, సామాన్య ప్రజల విషయానికొస్తే, ఈ నిర్ణయం వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతున్నా సహకరిస్తున్నారని ప్రశంసించారు.

English summary
Prime Minister Narendra Modi on Saturday said the decision to demonetise Rs.500 and 1000 currency notes was taken to cleanse the system and not to cause inconvenience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X