వేడుకలో బార్ గర్ల్స్‌తో చిందేసిన ముజఫర్‌నగర్ ఎమ్మెల్యే
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ శాసన సభ్యుడు ఓ పెళ్లి వేడుకలో బార్ గర్ల్స్‌తో కలిసి చిందులు వేశారు. రాష్ట్రంలోని ముజఫర్ నగర్ ఎమ్మెల్యే చిత్తరంజన్ స్వరూప్ ఇటీవల ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ జరిగిన కార్యక్రమాల్లో భాగంగా బార్ గర్ల్స్‌తో డ్యాన్స్ చేశాడు.
వెంటనే వేదిక పైకి ఎక్కి వారితో కలిసి అసభ్యకర రీతిలో నృత్యం చేయడమే గాకుండా, వారిపైకి కరెన్సీ నోట్లను విసిరారు. ఆ వేడుకకు హాజరైన పలువురు సమాజ్‌వాది పార్టీ శాసన సభ్యులు చూస్తూ ఆనందించారు. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ముజఫర్ నగర్ అల్లర్లు, సైఫాయి ఉత్సవంపై విమర్శలు ఎదుర్కొంది.

ఇప్పుడు ఈ ఘటన ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ యాదవ్‌కు చిక్కులు తెచ్చి పెట్టనుందంటున్నారు. మత ఘర్షణల కారణంగా ముజఫర్ నగర్ జిల్లాలో కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినాయకత్వం చిత్తరంజన్ చిందులను సీరియస్‌గా తీసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications