వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి అందరి సీఎం: ములాయం కోడలు షాకింగ్ కామెంట్స్

అపర్ణయాదవ్‌ మాట్లాడుతూ.. ‘సీఎం యోగి అందరి ముఖ్యమంత్రి, గోరఖ్‌పూర్‌లో ఆయన గోశాలను నడుపుతున్నారు. అందుకే ఆయన మా గోశాలను సందర్శించాల్సిందిగా కోరాం’ అని ఆమె పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కోడలు అపర్ణా యాదవ్ మరోసారి ఆయనకు షాకిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్నకుమారుడు ప్రతీక్‌యాదవ్‌కు చెందిన 'జీవ్‌ ఆశ్రయ్‌' గో సంరక్షణశాలను సందర్శించారు.

సీఎంకు స్వాగతం పలికారు..

సీఎంకు స్వాగతం పలికారు..

సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రతీక్‌యాదవ్‌, ఆయన సతీమణి అపర్ణయాదవ్‌ స్వాగతం పలికారు. గో సంరక్షణశాల గురించి ప్రతీక్‌ యాదవ్‌.. సీఎంకు వివరించారు. 64 ఎకరాల్లో ఉన్న గోశాలను సందర్శించిన సీఎం అక్కడ ఉన్న గోవులను నిమురుతూ వాటికి గడ్డి తినిపించారు. ఆయనతో పాటు యూపీ ఉపముఖ్యమంత్రి దినేశ్‌శర్మ కూడా ఉన్నారు.

అందరికీ సీఎం..

అందరికీ సీఎం..

ఈ సందర్భంగా అపర్ణయాదవ్‌ మాట్లాడుతూ.. ‘సీఎం యోగి అందరి ముఖ్యమంత్రి, గోరఖ్‌పూర్‌లో ఆయన గోశాలను నడుపుతున్నారు. అందుకే ఆయన మా గోశాలను సందర్శించాల్సిందిగా కోరాం' అని ఆమె పేర్కొన్నారు.

గతంలోనూ..

గతంలోనూ..

గతంలో ప్రధాని నరేంద్ర మోడీని అపర్ణయాదవ్‌ కలిసిన సమయంలోను అపర్ణ ఆయన గురించి మాట్లాడుతూ ‘మోడీ అందరి ప్రధాని' అని వ్యాఖ్యలు చేశారు. కాగా,
గతవారం ప్రతీక్‌ తన భార్య అపర్ణతో కలిసి సీఎం అతిథిగృహంలో యోగిని కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు.

బీజేపీలో చేరతారా?

బీజేపీలో చేరతారా?

అప్పటి నుంచీ అపర్ణా యాదవ్ భారతీయ జనతా పార్టీలో చేరతారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అపర్ణ యాదవ్ మాత్రం సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని చెప్పడం గమనార్హం.

English summary
Samajwadi Party's Aparna Yadav Meets Yogi Adityanath Again, Says 'He Is Everyone's Chief Minister'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X