అఖిలేష్ యాత్రలో రచ్చరచ్చ: చితక్కొట్టుకున్నారు(వీడియో)
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. ఏకంగా పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ రంగంలోకి దికి పరిస్థితిని చక్కదిద్దినట్లు కనిపించినా... నేతల మధ్య విభేదాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ విషయం యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ రథయాత్ర సందర్భంగా మరోసారి బహిర్గతమైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ 'వికాస్ రథయాత్ర' చేపట్టారు. రథయాత్ర సందర్భంగా అఖిలేశ్ అనుకూల, వ్యతిరేక వర్గానికి చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయాల్సివచ్చింది. అఖిలేశ్ రథయాత్ర పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తే.. ఘర్షణలు మరోసారి బయటపడి పార్టీలోని విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి.
పార్టీలో చోటు చేసుకుంటున్న విభేదాలు పార్టీ అధినేత ములాయంకు, సీఎం అఖిలేష్ తీవ్రమైన తలనొప్పిగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో కొంత ఆందోళన చెందుతోంది సమాజ్‌వాదీ పార్టీ అగ్రనాయకత్వం.
#WATCH: Clash erupted between SP workers in Lucknow ahead of UP CM Akhilesh Yadav's “Vikas Rath Yatra” pic.twitter.com/ZTwFgduVP8
— ANI UP (@ANINewsUP) 3 November 2016












Click it and Unblock the Notifications