ఒప్పుకోలేదని పారిపోయి పెళ్లి చేసుకున్న బాలికలు!

పాట్నా: పెద్దలు తమ ప్రేమకు అంగీకరించకపోతే ఓ అబ్బాయి, అమ్మాయి పారిపోయి పెళ్లి చేసుకోవడం సాధారణమే. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఓ అమ్మాయి.. మరో అమ్మాయితో పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం మోతిహరిలోని భాఘా ప్రాంతానికి చెందిన బాలికని అపహరించిందని ఖుషినగర్ జిల్లాకి చెందిన మరో బాలికపై తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు.

Same sex marriage: Class IX girls elope & marry secretly

ఈ మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వీరిద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట్టుబడ్డారు. విచారణ చేపట్టగా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డామని, ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో పారిపోయి గోరఖ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నామని తెలిపారు.

ఇద్దరు బాలికల వయస్సు వివరాలను సేకరించిన పోలీసులు, వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ ఇద్దరు బాలికలు కూడా 9వ తరగతి చదువుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+