అర్దరాత్రి హీరో హీరోయిన్ కు సినిమా చూపించిన పోలీసులు, మిడ్ నైట్ లో అక్కడ సౌండ్ లు !
సినిమా రంగానికి చెందిన కొందరు నటీ నటులు నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటారు. స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి వచ్చారు. కొంతమంది నటీనటుల కారణంగా స్యాండిల్ వుడ్ నిత్యం లేనిపోని ఆరోపణలు మూటకట్టుకుంటుందని కొందరు నటీనటులు ఇప్పటికే బహిరంగంగా మండిపడ్డారు.
ఇటీవల విడుదలైన కన్నడ సినిమా విజయం సాధించడంతో రాజాజీనగర్‌లోని జట్లాగ్ రెస్టోబార్‌లో భారీ సక్సెస్ మీట్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి సినిమా యూనిట్ సభ్యులతో పాటు పలువురు స్యాండిల్ వుడ్ నటీనటులు హాజరైనారు. కానీ నిబంధనలను ఉల్లంఘించి నటీనటులు, నటీమణుల పిచ్చపాటిగా పార్టీ పెట్టినందుకు జట్లాగ్ రెస్టోబార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

కానీ జట్లాగ్ రెస్టోబార్ ఈ నిబంధనను ఉల్లంఘించి, సెలబ్రిటీలను తెల్లవారుజామున 3.30 గంటల వరకు పార్టీ చేసుకోవడానికి అనుమతించింది.తెల్లవారుజామున 3 గంటలైనా రెస్టోబార్ మూసివేయకుండా తెరిచేఉండటంతో స్థానికులు సుబ్రహ్మణ్యనగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సుబ్రమణ్యనగర్ పోలీసులు జట్లాగ్ రెస్టోబార్‌పై దాడి చేసి వెంటనే బార్‌ను మూసివేశారు.

వేకువ జామున 3.30 గంటల ప్రాంతంలో జట్లాగ్‌లో రెస్టోబార్ లో పార్టీ చేసుకుంటున్న సెలబ్రిటీలను, ప్రముఖులను వాళ్ల ఇంటికి పంపించారు. ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు జట్లాగ్ రుస్టోబార్ యజమాని శశిరేఖా జగదీష్, మేనేజర్ అండ్ క్యాషియర్ ప్రశాంత్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
కేసు నమోదు చేసిన సుబ్రహ్మణ్య నగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.కన్నడ చిత్రసీమ ఇటీవలే ఓ స్టార్ యాక్టర్ నటించిన సినిమా విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది అందుకోసం చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ప్రముఖులు అందరికి సక్సెస్ పార్టీ అని చెప్పి ఇక్కడ గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. అయితే పార్టీలో పాల్గొన్న ప్రముఖుల పేర్లు, వివరాలను బెంగళూరు పోలీసులు బయటకు చెప్పలేదు.












Click it and Unblock the Notifications