Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వినాయకుడి మండపంలో అగ్నిప్రమాదం: జేపీ నడ్డా హారతి ఇచ్చిన కొద్దిసేపటికే

ముంబై: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికర ఘటన సంభవించింది. తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరిగే వినాయకుడి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓ వినాయకుడి మంటపంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో వ్యాపించాయి. ఈ ఘటనతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.

మహారాష్ట్రలోని పుణేలో ఈ ఘటన చోటు చేసుకుంది. సానె గురూజీ తరుణ్ మిత్ర మండలి ఏర్పాటు చేసిన మండపం ఇది. మండపం సమీపంలో బాణాసంచా కాల్చుతుండగా నిప్పురవ్వలు ఎగజిమ్మాయి. మండపం పైభాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ వెంటనే అగ్నికీలలు వ్యాప్తి చెందాయి.

Sane Guruji Tarun Mitra Mandal of Maharashtras Pune catches fire

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మండపాన్ని సందర్శించిన కొద్దిసేపటికే ఈ ఘటన సంభవించింది. సానె గురూజీ తరుణ్ మిత్రమండలి ఆహ్వానం మేరకు ఆయన కొద్దిసేపటి కిందటే ఈ మండపానికి వచ్చారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రపు హారతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

జేపీ నడ్డా రాకను పురస్కరించుకుని మిత్రమండలి ప్రతినిధులు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఆ సమయంలో నిప్పు రవ్వలు ఎగిరిపడి మండపం పైభాగంలో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో వ్యాపించాయి. మంటలు అంటుకోవడం వల్ల మండపం పైభాగంలో అమర్చిన కలశం, కాషాయ జెండా పూర్తిగా దగ్ధం అయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. గణేషుడిని దర్శించడానికి వచ్చిన భక్తులు భయభ్రాంతులకు గరయ్యారు. మండపాన్ని వదిలి దూరంగా వెళ్లిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+