సంజయ్ దత్ సంపాదన రూ.450! కూతురు నిరీక్షణ
ముంబై/ఎరవాడ: పుణేలోని ఎరవాడ జైలు నుంచి గురువారం విడుదల కానున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు జైలు అధికారులు రూ.450 అందజేయనున్నారు. ఇన్నాళ్లు ఖైదీగా ఉన్న సంజయ్ దత్ జైల్లో పేపర్ బ్యాగులు తయారు చేశారు.
కేసు విచారణలో ఉండగానే చాలా కాలం పాటు జైల్లోనే ఉన్న సంజయ్ దత్... శిక్ష ఖరారైన తర్వాత ఎరవాడ జైలులో మిగిలిన శిక్ష అనుభవించాడు. విచారణ ఖైదీగా అతడు మొత్తం 548 రోజులు జైల్లో గడిపాడు. దీంతో పాటు అతడు పెరోల్ పైన బయట ఉన్న 256 రోజులను పరిగణనలోకి తీసుకోని జైలు అధికారులు మిగిలిన కాలానికి అతడికి కూలీ కట్టిస్తున్నారు.
'సెమీ స్కిల్డ్ వర్కర్' కింద పరిగణించి, అతడితో పేపర్ బ్యాగులు తయారు చేయించారు. ఇందుకు అతడికి రోజువారీ కూలీ కూడా ఇచ్చారు. సాధారణంగా జైల్లో ఒకరోజు పనిచేస్తే ఖైదీలకు రూ.35 చెల్లిస్తారు. దీనిని 2015, సెప్టెంబర్ 1 నుంచి రూ.50కి పెంచారు.

ఈ లెక్కన ఖైదీగా సంజయ్ దత్ జైల్లో గడిపిన కాలం, అతడు పని చేసిన రోజులను లెక్కించిన జైలు అధికారులు మొత్తం అతడు రూ.38,000 కూలీ సంపాదించినట్లు తేల్చారు. అయితే అందులో పెద్ద మొత్తాన్ని అతడు ఇప్పటికే రోజువారీ ఖర్చు కోసం ఖర్చు పెట్టాడు.
జైల్లోని క్యాంటీన్లో తనకు కావాల్సిన వాటిని కొనుగోలు చేసిన అతడు ఆ మొత్తాన్ని దాదాపుగా వాడేశాడు. ఇలా అతడు అక్కడ సంపాదించి అక్కడే ఖర్చు పెట్టేయగా, ప్రస్తుతం అతడి కూలీలో కేవలం రూ.450 మాత్రం మిగిలి ఉంది. దీనిని జైలు అధికారులు అతని చేతికి ఇవ్వనున్నారు.
సంజయ్ దత్ కూతురు ఎదురుచూపు
సంజయ్ దత్ గురువారం జైలు నుంచి విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన కూతురు త్రిశాల్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తండ్రి విడుదల నేపథ్యంలో ఆమె కొన్ని సంతోషకర వీడియోలు షేర్ చేశారు.












Click it and Unblock the Notifications