ఆ టెక్ కంపెనీలో భారీగా ఉద్యోగుల నియామకం

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ తో ఒకవైపు వివిధ సాప్ట్ వేర్ సంస్థల్లో ఉద్యోగాలు ఊడతాయనే ఆందోళన వ్యక్తమవుతుండగా, మరోవైపు కొన్ని టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల నియామకంపైన కూడా దృష్టిపెడుతున్నాయి.

బహుళ జాతి సాప్ట్ వేర్ కమ్యూనికేషన్ సంస్థల్లో ఒకటైన ఎస్ఏపీ భారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీ దాదాపు 2500 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెప్పాయి.

బెంగళూరు క్యాంపస్ లో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో ఈ ఇంజనీర్ల నియామకాన్ని కంపెనీ చేపట్టబోతోంది. 50 మిలియన్ యూరోల పెట్టుబడులతో 5.15 లక్షల చదరపు అడుగుల్లో ఈ కొత్త క్యాంపస్ ను కంపెనీ ప్రారంభించింది.

 SAP Labs India likely to hire 2,500 engineers in next 2 years

గత రెండేళ్లుగా కూడా కంపెనీ ఉద్యోగ నియామకాలు చేపడుతూ వస్తోంది. ప్రతీ ఏటా 1500 మంది ఇంజనీర్లను నియమించుకుంటూ వస్తోంది. గత రెండేళ్లుగా తమ నియామకాలు కాలేజీ క్యాంపస్ ల ద్వారానే జరిపామని ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఖండెల్వాల్ చెప్పారు.

ఎస్ఏపీ ల్యాబ్స్ కు ఇండియాలో 10 వేలకు పైగా ఉద్యోగులున్నారని, వారిలో 7500 మంది ఇంజనీరింగ్ డివిజన్ లో పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎస్ఏపీకి మొత్తం 85000 మంది ఉద్యోగులున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BENGALURU: SAP Labs India is likely to hire 2,500 employees over the next two years with the inauguration of a new facility in its Bengaluru campus with the capa city to hold as many people. The company has hired aro und 1,500 emp loyees in each of the past two years in India.The 5.15 lakh square feet new facility has been established with an investment of 50 million euros.
Please Wait while comments are loading...