వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు ఫుడ్, క్యాండిల్స్ తయారీతో రోజుకు రూ.50: భర్తను కౌగిలించుకొని ఏడ్చిన శశికళ

అక్రమాస్తుల కేసులో లొంగిపోయిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. రూ.66.5 కోట్ల కేసులో నిందితురాలైన చిన్నమ్మ.. జైలులో కొవ్వొత్తులు తయారు చేయనున్నారు. ఇందు

|
Google Oneindia TeluguNews

చెన్నై: అక్రమాస్తుల కేసులో లొంగిపోయిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. రూ.66.5 కోట్ల కేసులో నిందితురాలైన చిన్నమ్మ.. జైలులో కొవ్వొత్తులు తయారు చేయనున్నారు. ఇందుకోసం ఆమె రోజుకు రూ.50 పొందనున్నారు.

వింతగా శశికళ, చీలిక దిశగా పార్టీ: జయ సమాధి వద్ద 3సార్లు అందుకే కొట్టారు..వింతగా శశికళ, చీలిక దిశగా పార్టీ: జయ సమాధి వద్ద 3సార్లు అందుకే కొట్టారు..

శశికళ మధ్యాహ్నం ప్రత్యేక కోర్టు న్యాయవాది ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. ఆమెకు జైలులో క్యాండిల్స్ తయారు చేసే పనిని అప్పగించారు.

శశికళకు ఏం ఇచ్చారంటే..

కాట్
24 గంటలు రన్నింగ్ వాటర్
టీవీ
వాకింగ్ స్పేస్
వెస్ట్రన్ కమోడ్

శశికళకు ఏం ఇవ్వలేదంటే..

ఏసీ రూంకు నో
ఇంటి ఫుడ్‌కు నో
సపరేట్ బ్యారెక్‌కు, జయలలిత తర్వాత బ్యారెక్‌కు నో
సహాయకుడికి నో
బయటి వైద్యుడికి నో
యోగాకు స్థలానికి నో చెప్పారు

రాగానే ఏం చేయాలో చెబుతారు

రాగానే ఏం చేయాలో చెబుతారు

జైలుకు వచ్చిన ప్రతి ఖైదీకి కూడా మొట్టమొదట వారు కారాగారంలో చేసే పనిని అప్పగిస్తారు. జైల్లోకి రాగానే ఏం చేయాలో చెబుతారు. తొలుత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ ఇస్తారు. అనంతరం ఏం చేయాలో చెబుతారు.

భర్తను కౌగిలించుకొని ఏడ్చిన శశికళ

భర్తను కౌగిలించుకొని ఏడ్చిన శశికళ

అక్రమాస్తుల కేసులో శిక్షపడిన శశికళ, ఇళవరసిలకు జైలు అధికారులు కొవ్వొత్తుల తయారీని అప్పగించారు. వారికి రోజుకు చెరీ రూ.50 వస్తుంది. జైలులోకి వెళ్లే ముందు శశికళ ఏడ్చినట్లు జైలు అధికారులు చెప్పారు. అంతేకాదు, తన భర్తను కౌగిలించుకొని కంటతడి పెట్టిందని చెప్పారు.

నీలం రంగు చీర.. ప్లేటు, మగ్గు ఇచ్చారు

నీలం రంగు చీర.. ప్లేటు, మగ్గు ఇచ్చారు

శశికళ జైలులోకి రాగానే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె వద్ద ఉన్న అన్ని వస్తువులను ఇవ్వాలని జైలు అధికారులు చెప్పారు. బంగారు ఆభరణాలు, వాచ్ తదితరాలు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత ఆమెకు జైలు యూనిఫాం అయిన నీలం రంగు చీర ఇచ్చారు. ఓ ప్లేటు, మగ్గు ఇచ్చారు. ఆమెకు ఖైదీ నెంబర్ 10711 కేటాయించారు. 2015లో ఆమె జైలులో ఉన్నప్పుటు ఖైదీ నెంబర్ 7403 ఇచ్చారు.

జైలు ఫుడ్, ఇద్దరు మహిళలతో గది

జైలు ఫుడ్, ఇద్దరు మహిళలతో గది

శశికళను ప్రత్యేక ఖైదీగా చూసేందుకు నిరాకరించారు. దీంతో ఆమె జైలు ఫుడ్ తినాల్సి ఉంది. మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆమెకు బ్యారక్ కేటాయించారు. ఇంటి ఫుడ్, ఏసీ రూం, 24 మినరల్ వాటర్, టీవీ తదితర సదుపాయాలు కోరారు. కానీ న్యాయమూర్తి అశ్వథ్ నారాయణ తిరస్కరించారు. దీంతో ఆమె జైలులో వీఐపీ ఖైదీగా ఉండలేరు. జయలలిత ఉన్న బ్యారక్‌లోనే ఉంచాలని శశికళ న్యాయమూర్తిని అడగ్గా.. అది జైలు అధికారులు నిర్ణయిస్తారన్నారు. శశికళ అయినా, ఎవరైనా తాము రూల్ బుక్ ప్రకారం సదుపాయాలు కల్పిస్తామని జైలు అధికారులు వెల్లడించారు.

English summary
Sasikala Natarajan who was convicted in the Rs 66.5 crore disproportionate assets case will earn Rs 50 a day. The work allotted to her in jail is candle making. Every prisoner is first allotted a job when he or she enters the jail. After a medical check and the allotment of a prisoner number, a job is allotted to the prisoner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X