పన్నీరుకు షాక్: సీనియర్ నేతలపై వేటు, శశికళ హింసించారన్న రిసార్ట్ ఎమ్మెల్యే
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తనకు ఎదురుతిరిగిన, అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు పలికిన నేతలపై సీరియస్‌గా స్పందించారు.
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తనకు ఎదురుతిరిగిన, అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు పలికిన నేతలపై సీరియస్‌గా స్పందించారు. ఇప్పటికే పన్నీరు సెల్వంను అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పించిన శశికళ.. ఇప్పుడు ఆయనకు మద్దతు తెలిపిన పార్టీ సీనియర్ నేతలపై కూడా చర్యలు తీసున్నారు.
పన్నీరుకు మద్దతు పలికిన సీనియర్ నేతలుకె.పాండ్యరాజన్, పీహెచ్. పాండ్యన్, పొన్నయన్, మునుస్వామి, ఎన్. విశ్వనాథన్‌లను బహిష్కరించారు శశికళ. ఈ చర్యల ద్వారా తనకు వ్యతిరేకంగా వ్యవహించిన వారికి పరోక్షంగా హెచ్చరికలు పంపారు.

తమిళనాడు అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో గంట గంటకీ అక్కడి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుని ప్రకటించిన నేపథ్యంలో ఇక గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రిసార్టులో హింసించారు: ఎమ్మెల్యే శరవణన్
అన్నాడీఎంకే పార్టీలో తనకు మద్దతు తగ్గకుండా ఉండేందుకు శశికళ నటరాజన్.. తమ ఎమ్మెల్యేలను రిసార్టుల్లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే సోమవారం రాత్రి వేషం మార్చుకొని, గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి పారిపోయి పన్నీర్ సెల్వం వద్దకు వచ్చిన దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ తాజాగా మీడియాతో మాట్లాడారు.
శశికళ అనుచరులు తమను రిసార్టులో చిత్రహింసలకు గురిచేశారని ఆయన అన్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలందరినీ ఒంటరిని చేసి అక్కడ ఉంచారని ఆయన ఆరోపించారు. తమ భావోద్వేగాలను సైతం పట్టించుకోకుండా తమను మానసికంగా, శారీరకంగా వేధించారని ఎమ్మెల్యే శరవణన్ చెప్పారు.
మరోవైపు తాము ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా అక్కడి నుంచి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతూ వస్తున్నామని తెలిపారు. తమ నియోజక వర్గాల ప్రజలతో ఫోన్ ద్వారా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అయితే, తమకు రిసార్ట్‌లో మద్యం, అమ్మాయిలను సరఫరా చేశారంటూ వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలేనని ఆయన చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications