శశికళకు షాక్: టోపిగుర్తు తీసుకోవడంపై చిన్నమ్మ ఆగ్రహం, పన్నీర్ వ్యూహమిదే

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై:ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో ఎన్నికల గుర్తు దక్కకపోవడంతో అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకెకు టోపి గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.దీంతో అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

అన్నాడిఎంకె సంక్షోభం నేపథ్యంలో ఇరువర్గాలు పార్టీ ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే ఎన్నికల సంఘం రెండు వర్గాలకు ఎన్నికల సంఘం ఇతర గుర్తులను కేటాయించింది.

అన్నాడిఎంకె ఎన్నికల గుర్తు రెండాకుల కోసం ఆ పార్టీ తీవ్రంగానే ప్రయత్నించింది.అయతే ఎన్నికల సంఘం సాంకేతిక కారణాలను చూపుతూ రెండు వర్గాలకు పార్టీ ఎన్నికల గుర్తును కేటాయించలేదు.స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తులను కేటాయించింది.

దరిమిలా ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ బరిలో నిలిచారు.అయితే ఆయనకు టోపి గుర్తును కేటాయించింది.

రెండాకుల గుర్తు దక్కకపోవడం పట్ల శశికళ ఆగ్రహం

రెండాకుల గుర్తు దక్కకపోవడం పట్ల శశికళ ఆగ్రహం

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు దక్కకపోవడం పట్ల అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీ నాయకులపైఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాద్యతలను చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని భావించి పథకాన్ని అమలు చేసే తరుణంలో జయలలిత కేసులో శిక్షను అనుభవిస్తోంది.అయితే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా శశికళ దినకరన్ ను నియమించారు.అయితే దినకరన్ కు పార్టీ పగ్గాలు ఇచ్చిన తర్వాత పార్టీ ఎన్నికల గుర్తు కోల్పోవడం పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారని సమాచారం.ఈ విషయమై దినకరన్ పై ఆమె ఫైరయ్యారని తెలుస్తోంది.

దినకరన్ కు సవాళ్ళు

దినకరన్ కు సవాళ్ళు

అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని ఆమె నడిపించారు.అయితే అదే సమయంలో ఆమెను కేసులు చుట్టుముట్టడంతో ఆమెకు ఇబ్బందులు కలిగాయి.ఈ పరిస్థితుల్లో జైలుకు వెళ్లే రోజున ఉదయం పూటే ఆమె దినకరన్ ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఆమె నిర్ణయం తీసుకొన్నారు. శశికళ జైలులో ఉన్నందున పార్టీని నడిపే బాధ్యతను దినకరన్ తన భుజాలపై వేసుకొన్నారు. పార్టీని విజయపథంలో నడపడం అంటే ఆషామాషీ వ్యవహరం కాదని తేటతెల్లమైంది.పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయడంతో పాటు విశ్వాసపరీక్షలో ఆయన నెగ్గేలా చేయడంలో శశికళ చకచక పావులు కదిపారు. ఈ విషయంలో ఆమె పన్నీర్ కంటే పై చేయి సాధించారు.ఆర్ కె నగర్ ఉప ఎన్నికలు దినకరన్ కు మాత్రం సవాల్ గా మారాయి.ఈ ఎన్నికల్లో ఆయనే పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ తరుణంలో ఈ ఎన్నికల్లోపార్టీ గుర్తు దక్కకపోవడం ఆ పార్టీకి తీవ్రమైన నష్టంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

శశికళ వర్గానికి పెద్ద దెబ్బ

శశికళ వర్గానికి పెద్ద దెబ్బ

అన్నాడిఎంకె పార్టీ ఎన్నికల గుర్తు రెండాకులను ఎన్నికల సంఘం స్థంబింపజేయడం శశికళ వర్గానికి పెద్ద దెబ్బే.రెండాకుల గుర్తును అన్నాడిఎంకెలోని శశికళ వర్గానికి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ గుర్తును చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో దినకరన్ వైఫల్యం చెందారని శశికళ అభిప్రాయపడినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.పార్టీ ఎన్నికల గుర్తు లేకుండా ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనపై శశికళ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

పన్నీర్ వర్గందే పైచేయి

పన్నీర్ వర్గందే పైచేయి

ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అన్నాడిఎంకె ఎన్నికల గుర్తు రెండాకులను తమ ప్రత్యర్థులకు దక్కకుండా పన్నీర్ వర్గం వ్యూహత్మకంగా వ్యవహరించారు.ఈ విషయంలో పన్నీర్ వర్గం విజయం సాధించింది.మెజార్టీ ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నందను రెండాకుల గుర్తును తమకు కేటాయించాలని శశికళ వర్గం ఈసీ వద్ద వాదించింది. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లని సమయంలో ఆమెకు రెండాకుల గుర్తును ఎలా కేటాయిస్తారని పన్నీర్ సెల్వం గ్రూపు ఎన్నికల సంఘం వద్ద తమ వాదనను విన్పించింది.దీంతో ఈ గుర్తును ఎవరికీ ఇవ్వకుండా స్థంబింపజేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.

రెండు లైట్ల గుర్తుతో పన్నీర్ సెల్వం దూకుడు

రెండు లైట్ల గుర్తుతో పన్నీర్ సెల్వం దూకుడు

అన్నాడిఎంకె ఎన్నికల గుర్తు రెండాకులు తమిళనాడులో ఓటర్లకు చిరపరిచితం.అయితే ఈ గుర్తును ఎన్నికల సంఘం స్థంబింపజేసింది.అయితే ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పన్నీర్ సెల్వం వర్గం నుండి బరిలో మధుసూధన్ ఉన్నారు.అయితే రెండాకుల గుర్తును పోలినట్టుగానే రెండు లైట్ల గుర్తును పన్నీర్ సెల్వం గ్రూపు ఎంచుకొంది.ఈ గుర్తుతో తమకు ప్రయోజనం ఉంటుందని పన్నీర్ గ్రూపు భావిస్తోంది.అయితే శశికళ గ్రూపు మాత్రం ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో టోపి గుర్తును ఎంచుకొంది.

అన్నాడిఎంకె అమ్మ పార్టీ పేరుతో దినకరన్ పోటీ

అన్నాడిఎంకె అమ్మ పార్టీ పేరుతో దినకరన్ పోటీ


అన్నాడిఎంకె ఎన్నికల గుర్తు దక్కకపోవడంతో అన్నాడిఎంకె అమ్మ పార్టీ పేరుతో దినకరన్ ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగారు. అన్నాడిఎంకె తరపున పోటీచేయరాదని ఆంక్షలు విధించడంతో ఈ పరిస్థితి నెలకొంది.ఎంజీఆర్ స్థాపించి,జయలలిత నడిపించిన పార్టీ అనే ఆనంరం మాత్రం లేకుండా పోయింది.ఆర్ కె నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకూదని చెప్పినా వినలేదని శశికళ దినకరన్ పై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.

ఆర్ కె నగర్ లో ఓటమిపాలైతే తీవ్ర నష్టం

ఆర్ కె నగర్ లో ఓటమిపాలైతే తీవ్ర నష్టం

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైతే తీవ్రంగా నష్టపోవాల్స వస్తోందని శశికళ అభిప్రాయపడుతున్నారు. ఇళవరసి కుమారుడు వివేక్ శుక్రవారం నాడు బెంగుళూరులో శశికళను కలిశారు. టోపి గుర్తును ఎంపిక చేసుకోవడంపై ఆమె దినకరన్ పై ఆగ్రహాన్ని వివేక్ వద్ద వ్యక్తం చేశారని సమాచారం.ఈ విషయంలో పన్నీర్ సెల్వం దూకుడుగా వ్యవహరించిందని ఆమె ప్రస్తావించారని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
sasikala fire on aiadmk deputy general secretary dinakaran.sasikala disappointed to choose cap symbol in rk nagar by elections.
Please Wait while comments are loading...