శశికళ,జయలలిత ఇద్దరు ప్రాణస్నేహితులు, ఆరోపణలన్నీ అవాస్తవాలే

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, చిన్నమ్మ మధ్య అత్యంత స్నేహపూర్వకంగా ఉండేవారని చెప్పారు. జయలలిత వద్ద వ్యక్తిగత నర్సుగా పనిచేసిన ప్రమీల చెప్పారు.జయలలిత అనుక్షణం శశికళను గుర్తుచేసుకొనేవారని ఆమె గ

చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చిన్నమ్మ శశికళలు అత్యంత స్నేహపూర్వకంగా ఉండేవారని జయలలిత వద్ద వ్యక్తిగత నర్సుగా పనిచేసిన ప్రమీల చెప్పారు.

జయలలిత, శశికళ మధ్య సత్సంబంధాలు ఉండేవని, ఒకరంటే , మరోకరికి ప్రాణమని, అత్యంత ప్రాణంగా ఉండేవారని ఆమె వివరించారు. 2001లో జయలలిత వద్ద ఆమె వ్యక్తిగత నర్సుగా పనిచేశారు.ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.

జయలలిత శశికళను ప్రతిక్షణం పిలిచేవారని ఆమె గుర్తుచేసుకొన్నారు. జయలలిత ఎదుర్కొన్న సవాళ్ళను, సంక్షోభాలను,సమస్యలను ఆమె అతి దగ్గరనుండి చూశారని ఆమె చెప్పారు.

jayalalithaa

జయలలితకు ఏం కావాలో శశికళ దగ్గరుండి చూసకొనేవారని ఆమె చెప్పారు.జయలలిత వద్ద 34 ఏళ్ళపాటు శశికళ ఉన్నారని, వారిమధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని ఆమె అభిప్రాయపడ్డారు.

జయలలిత మృతిపై వచ్చిన ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు.చాలామంది రాజకీయనాయకులు తమ లబ్దికోసమే శశికళపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.వారిద్దరి మధ్య అలాంటి అవకాశమే లేదన్నారు.

అమ్మ వారసత్వాన్ని కొనసాగించే సత్తా శశికళకు మాత్రమే ఉందన్నారు ప్రమీల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+