మాపై తీర్పును సమీక్షించండి: రెండున్నర నెలల తర్వాత సుప్రీంకు శశికళ

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి, బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తనపై కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు ఆమెను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. జైలులో ఉన్నారు. జైలుకు వెళ్లిన రెండున్నర నెలల తర్వాత ఆమె తీర్పుపై సమీక్ష కోరుతున్నారు.

sasikala

అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు ఫిబ్రవరి 14న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ను దోషులుగా తేల్చింది. రెండు రోజుల అనంతరం ఆమె బెంగళూరు జైలుకు వెళ్లారు.

ఆస్తుల కేసులో తొలి నిందితురాలు జయలలిత మృతి చెందిన విషయాన్ని ఈ పిటిషన్లో శశికళ పేర్కొన్నారు. జయ మృతి నేపథ్యంలో ఆమెను తప్పించారని, తమపై ఇచ్చిన తీర్పు పైనా రివ్యూ చేయాలని కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Convicted in a disproportionate assets case, Sasikala Natarajan has moved the Supreme Court seeking a review.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి