చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీని కలవనున్న శశికళ: సవాల్.. చిన్నమ్మకు ఆ పదవి సులభం కాదా?

అన్నాడీఎంకే పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన శశికళ పుష్ప ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన శశికళ పుష్ప ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని మోడీని కలిశారు. ఇప్పుడు శశికళ పుష్ప ప్రధాని మోడీని కలవనున్నారు. శశికళను అన్నాడీఎంకే చీఫ్‌గా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు జయలలిత నెచ్చెలి శశికళ ఉవ్వీళ్లూరుతున్నారు.

మరోవైపు, అన్నాడీఎంకే టాప్ పోస్ట్ పైన శశికళ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. పార్టీలోను ఆమె చక్రం తిప్పుతున్నారు. ఎక్కువ మంది పార్టీ నాయకులు ఆమెకు మద్దతుగా ఉన్నారు.

Sasikala Pushpa to meet the Prime Minister Narendra Modi

అదే సమయంలో ఆమెకు వ్యతిరేకత కూడా ఉంది. శశికళ పుష్ప వంటి వారు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తే తాను కూడా రేసులో ఉంటానని శశికళ పుష్ప ఇప్పటికే ప్రకటించారు.

ఈ నేపథ్యంలో శశికళకు వ్యతిరేకంగా ఆర్కే నగర్ (దివంగత జయలలిత నియోజకవర్గం)లో పోస్టర్లు వెలిశాయి. శశికళ పార్టీ పగ్గాలు చేపట్టాలంటే తొలుత ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాలని పోస్టర్‌లో సవాల్ విసిరారు. తద్వారా శశికళకు పార్టీ పగ్గాలు అంత సులభంగా వచ్చేలా కనిపించడం లేదు.

English summary
Rajya Sabha MP Sasikala Pushpa who was expelled earlier from ADMK to meet the Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X