జయ సాగనంపితే.. శశి కీలక పదవి: అన్నాడీఎంకేలో ఆమె తర్వాత దినకరణే

జైలుకు వెళ్లడం ఖాయమని తేలడంతో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. తన బంధువులైన టీటీవీ దినకరన్, వెంకటేష్‌లను పార్టీలోకి తీసుకువచ్చారు శశికళ. కాగా, గతంలో వీరిద్దరినీ జయలలిత పార్టీ నుంచి సాగనంపడం గమనార్హం.

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో... తమిళనాడు అధికార పార్టీ ఏఐఏడీఎంకే పగ్గాలను అప్పగించడంపై వీకే శశికళ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జైలుకు వెళ్లడం ఖాయమని తేలడంతో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. తన బంధువులైన టీటీవీ దినకరన్, వెంకటేష్‌లను పార్టీలోకి తీసుకువచ్చారు శశికళ. కాగా, గతంలో వీరిద్దరినీ జయలలిత పార్టీ నుంచి సాగనంపడం గమనార్హం.

ప్రస్తుతం ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న శశికళ... తన తర్వాత కీలక పదవి అయిన డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్‌కు బాధ్యతలు అప్పగించారు. తాను జైలుకెళ్లడం ఖాయం కావడంతో పార్టీపై పట్టునిలబెట్టుకునేందుకే శశికళ తన సోదరి కొడుకైన దినకరన్‌ను రంగంలోకి దించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Sasikala's Betrayal? Nephews Expelled By Jayalalithaa Back In Party

కాగా, అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని తొలిసారిగా శశికళ సృష్టించడం గమనార్హం. రెండు దశాబ్దాల నాటి జయలలిత అక్రమాస్తు కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

ఇదే కేసులో సహనిందితురాలిగా ఉన్న వీకే శశికళను దోషిగా నిర్ధారిస్తూ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో జయలలిత స్థానంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలన్న శశికళ ఆశలు గల్లంతయ్యాయి. రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురికావడంతో శశికళకు జైలు జీవితం ఖరారైపోయింది. దీంతో కోర్టు ముందు లొంగిపోయేందుకు ఆమె బెంగళూరుకు బుధవారం బయల్దేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+