వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ 'లక్కీ నెంబర్', పన్నీరుకు ఎదురు దెబ్బ!

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం తన పదవి విషయంలో రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనా? శశికళ సీఎం పదవిలో కూర్చునేందుకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం తన పదవి విషయంలో రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనా? శశికళ సీఎం పదవిలో కూర్చునేందుకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నారు.

సంక్రాంతి పండుగకు ముందు లేదా ఆ తర్వాత శశికళ సీఎం బాధ్యతలు చేపట్టవచ్చుననే వాదనలు వినిపించాయి. ఈ నెల 12వ తేదీన (ఈ రోజు), 18వ తేదీన బాధ్యతలు చేపట్టేందుకు మంచి రోజులు ఉన్నాయని జ్యోతిష్కులు చెప్పారని అంటున్నారు.

ఈ రోజు వరకు అయితే ముఖ్యమంత్రి బాధ్యతల విషయంలో ఎలాంటి సమాచారం రాలేదు. ఈ నెల 18వ తేదీన సీఎంగా బాధ్యతలు చేపట్టకపోయినా.. ఆ తర్వాత మాత్రం సాధ్యమైనంత త్వరలోనే పీఠంపై కూర్చోవచ్చునని అంటున్నారు.

కారు ఎందుకు తిరిగిచ్చావ్: అతనిని అడిగిన శశికళ, తిరిగొచ్చాడు

శశికళకు పార్టీలో బాగా మద్దతు ఉంది. సీనియర్ నేతలు కూడా ఆమెకు అనుకూలంగా ఉండటం గమనార్హం. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆమె వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వంకు షాక్ తప్పదని అంటున్నారు.

పార్టీలో, ప్రభుత్వంలో, జయతో చాలాకాలంగా ఉండటం.. ఇవన్నీ శశికళ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఐటి రెయిడ్ తర్వాత శశికళను పార్టీ చీఫ్‌గా ఎన్నుకొని షాకిచ్చారు.
తమిళనాడులోను, ప్రతిపక్షాలు.. స్టాలిన్ లేదా విపక్షాలకు ధీటైన నేతగా శశికళను చూస్తున్నారు. తమిళనాట స్టాలిన్ వర్సెస్ శశికళగా చూస్తున్నారు. వీటన్నింటిని బేరీజు వేసుకుంటే లక్కీ నెంబర్ ఆమె వైపుకే ఉందని, ఇది పన్నీరుకు బ్యాడ్ లక్ తెస్తుందంటున్నారు.

పన్నీరు ప్రతిఘటించలేరు

పన్నీరు ప్రతిఘటించలేరు

తన నుంచి శశికళ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే పన్నీరుసెల్వం ఏమాత్రం ప్రతిఘటించలేని పరిస్థితిలో ఉన్నారు. బీజేపీ ద్వారా పట్టుకోసం ప్రయత్నించినా.. శశికళ వ్యూహాల ముందు అన్నీ చిత్తవుతున్నాయి. పార్టీలో ఆయనకు పెద్దగా మద్దతు, పట్టు లేదు.

న్యూ ఓల్డ్ సీఎం

న్యూ ఓల్డ్ సీఎం

దీంతో సీఎం పీఠం చిన్నమ్మకు ఇవ్వడం మినహా, ఆయన ప్రతిఘటించలేని పరిస్థితిలో ఉన్నారు. పైగా, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు నిత్యం చిన్నమ్మ బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. అంటే పన్నీరు సెల్వం వద్దని చెప్పినట్లే. పార్టీ సీనియర్ ఎంపీ మాట్లాడుతూ.. పన్నీరు సెల్వం 'న్యూ ఓల్డ్ సీఎం' అన్నారు.

జయలలిత దారిలో..

జయలలిత దారిలో..

జయలలిత ఉన్నప్పుడు పార్టీలో అన్నీ ఆమెనే. ఆమె తర్వాత.. అనే ప్రశ్ననే ఉదయించలేదు. ఇప్పుడు శశికళ కూడా అదే దారిలో పయనిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. గత డిసెంబరులో జయలలితకు అంత్యక్రియలు చేసిన చోటుకు వచ్చారు. ఆమెతో పాటు సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు, ఇతర నేతలు ఉన్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో శశికళ మాట్లాడుతూ.. కేవలం 'మంత్రులు' అంటూ ప్రస్తావించారు. సీఎం పన్నీరును గుర్తించలేదనే చెప్పవచ్చు. అంటే తాను ఫస్ట్, ఆ తర్వాత అందరూ సమానమేనని శశికళ భావిస్తున్నట్లుగా ఉందంటున్నారు. జయలలిత దారిలో నడుస్తున్నారంటున్నారు.

2021 దాకా నిరీక్షించాల్సిన అవసరం లేదు

2021 దాకా నిరీక్షించాల్సిన అవసరం లేదు

తమిళనాడులో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, చిన్నమ్మ అప్పటి దాకా నిరీక్షించాల్సిన అవసరం లేదని, పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించేందుకు చిన్నమ్మ పగ్గాలు చేపట్టాలని చాలామంది అంటున్నారు. 99 శాతం మంది పార్టీలో చిన్నమ్మకు మద్దతుగా ఉన్నారని చెబుతున్నారు.

బీజేపీకి అది హెచ్చరికనా?

బీజేపీకి అది హెచ్చరికనా?

ఇప్పటికే, శశికళ.. బీజేపీకి, పన్నీరు సెల్వంకు తన వ్యూహచతురతను చూపించిందని అంటున్నారు. ఐటీ దాడులు కుట్రపూరితంగా జరిగాయనేది కొందరి అభిప్రాయం. దానికి జడవకుండా శశికళ పార్టీ పగ్గాలు చేపట్టి బీజేపీకి, పన్నీరుకు ఆమె షాకిచ్చారని అంటున్నారు. శశికళ ఇచ్చిన హెచ్చరిక అను చెబుతున్నారు.

ఆర్కే నగర్

ఆర్కే నగర్

చిన్నమ్మ సీఎం పదవి చేపట్టినా ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. జయ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి పోటీ చేయడంపై చర్చ సాగుతోంది. ఆర్కే నగర్లో చిన్నమ్మకు కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. జయ స్థానంలో ఆమెను చూడలేమని అంటున్నారు. మరోవైపు, సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు శశికళ సీఎం పదవి విషయంలో ఆచితూచి అడుగులు వేయవచ్చునని అంటున్నారు.

English summary
Sasikala’s Lucky Number Will Bring Bad Luck for Panneerselvam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X