వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ కాన్వాయ్‌లోనే జైలుకు శశికళ: ఈ రోజే తమిళ 'నాటకానికి' తెర!

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ దివంగత జయలలిత వినియోగించిన కాన్వాయ్‌లోనే బెంగళూరు బయలుదేరారు. అక్రమాస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ దివంగత జయలలిత వినియోగించిన కాన్వాయ్‌లోనే బెంగళూరు బయలుదేరారు. అక్రమాస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

ఆమె లొంగిపోయేందుకు బుధవారం మధ్యాహ్నం చెన్నై నుంచి బెంగళూరు బయలుదేరారు. జయ వినియోగించిన వాహనంలోనే బయలుదేరారు.

<strong>'ప్రత్యేక' ఖైదీగా గుర్తించండి: ప్లాన్ మార్చి.. శశికళ 'ఏ' క్లాస్ వ్యూహం?</strong>'ప్రత్యేక' ఖైదీగా గుర్తించండి: ప్లాన్ మార్చి.. శశికళ 'ఏ' క్లాస్ వ్యూహం?

జయలలిత చనిపోయన తర్వాత ప్రతి అడుగులోను, ప్రతి చర్యలోనూ ఆమెను తలపించేలా శశికళ నడుచుకున్నారు. చీరకట్టు దగ్గర నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేసే స్టైల్ వరకు జయను ఇమిటేట్ చేశారు.

Sasikala sentenced: Security beefed up around Bengaluru's Parappana Agrahara jail

పోయస్ గార్డెన్‌లో జయలలిత ఉన్న ఇంట్లోకే పూర్తి స్థాయిలో మాకాం మార్చారు. ఆమె వినియోగించిన వాహనాన్నే వాడారు. ఇప్పుడు జైలు శిక్షను అనుభవించడానికి కూడా జయ అదే వాహనంలో బయలుదేరారు. అంతకుముందు, జయలలిత సమాధి వద్ద మూడుసార్లు కింద కొట్టి, శపథం చేశారు.

ఏం జరుగుతోంది?

తమిళనాట నేడో, రేపో రాజకీయ అనిశ్చితికి తెరపడే అవకాశం ఉంది. సీఎం ఎవరు అనే విషయంపై గవర్నర్‌ విద్యాసాగర రావు సాయంత్రం నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

శశికళ తన స్థానంలో ముఖ్యమంత్రి పీఠానికి పళని స్వామి పేరును తెరపైకి తెచ్చింది. మరోవైపు, ఎమ్మెల్యేలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు వస్తున్నారు. తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ముఖ్యమంత్రిగా తనకే అవకాశం ఇవ్వాలని మంగళవారం పళనిస్వామి గవర్నర్‌ను కోరారు.

<strong>వింతగా శశికళ, చీలిక దిశగా పార్టీ: జయ సమాధి వద్ద 3సార్లు అందుకే కొట్టారు..</strong>వింతగా శశికళ, చీలిక దిశగా పార్టీ: జయ సమాధి వద్ద 3సార్లు అందుకే కొట్టారు..

మరోవైపు, శశికళపై అన్నాడీఎంకే ఎమ్మెల్యే శరవణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశికళ వర్గం తనను నిర్బంధించిందని.. మద్దతివ్వాలని బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. కూవత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.

ఇంకోవైపు, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ నియామకంపై పార్టీ నేతల్లో భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. తాను జైలుకు వెళ్లడం ఖాయమైన నేపథ్యంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా తన దగ్గరి బంధువైన దినకరన్‌ను శశికళ బుధవారం నియమించారు.

అయితే దినకరన్‌ నియామకాన్ని ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పాండ్యన్‌ తప్పుబట్టారు. దీనికి నిరసనగా కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనన్న సందేహం తలెత్తుతుంది.

English summary
Bengaluru City police have made elaborate security arrangements around Parappana Agrahara Central Prison in the city, following the conviction for VK Sasikala and two others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X