ఐఏఎస్ అధికారి రాజీనామా, టాప్ ర్యాంకర్ సింధుకు పోస్టింగ్, బీజేపీ ప్రభుత్వం !

బెంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాధికారి (ఐఏఎస్) శశికాంత్ సెంథిల్ రాజీనామా చెయ్యడంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇలాంటి సంఘటనలు మరోసారి వెలుగు చూడకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం వెంటనే మరో ఐఏఎస్ అధికారిని, టాప్ ర్యాంకర్ సింధు బి. రూపేష్ ను దక్షిణ కన్నడ జిల్లాధికారిగా పోస్టింగ్ ఇచ్చింది.

ప్రభుత్వం తీరుతో విసుగు చెందిన దక్షిణ కన్నడ జిల్లాధికారి, శశికాంత్ సెంథిల్ ఐఏఎస్ శుక్రవారం ఆయన పదవికి రాజీనామా చెయ్యడంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ రాజీనామాతో బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఉలిక్కిపడింది.

Sasikant Senthil IAS has resigned, Sindhu B Rupesh as new dc for Dakhsina Kannada District.

ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ ఎందుకు రాజీనామా చేశారు ?, అసలు ఏం జరిగింది ? ఇలాంటి సంఘటనలు తన ప్రభుత్వంలో మరోసారి జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఒక్క రోజుకూడా పూర్తి కాకమందే దక్షిణ కన్నడ జిల్లాధికారిగా సింధు బి. రూపేష్ ను నియమిస్తూ బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సింధు బి. రూపేష్ ఇంత కాలం ఉడిపి జిల్లా పంచాయితీ సీఇవోగా పని చేశారు.

మైసూరుకు చెందిన సింధు బి. రూపేష్ బీఇ విద్యాభ్యాసం చేశారు. సింధు బి. రూపేష్ 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సింధు బి. రూపేష్ ఐఏఎస్ టాప్ ర్యాంకర్. ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ ఆయన పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆ పదవిలో సింధు బి. రూపేష్ ను కర్ణాటక ప్రభుత్వం నియమించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+