వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాయ్ రాజా కాయ్: యూపీలో బీజేపీ, పంజాబ్‌లో హంగ్.. బెట్టింగ్ ఇలా, ఇలా చెల్లింపు

|
Google Oneindia TeluguNews

5 రాష్ట్రాల ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎలక్షన్ జరగనున్నాయి. కానీ ఒమిక్రాన్ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ పోరు ఆసక్తికరంగా మారింది. అయితే పోల్ సర్వేల్లో మాత్రం పంజాబ్ రిజల్ట్ ఆసక్తికరంగా వస్తోంది. ఇక సత్తార్ బజార్.. బెట్టింగ్ మార్కెట్ మాత్రం పంజాబ్‌లో ఆప్ అధికారానికి కొంచెం దూరంలో ఉంటుందని తెలిపింది. ఇక యూపీలో బీజేపీ అధికారం చేపడుతాయని బెట్ చేస్తోంది.

యూపీలో బీజేపీ

యూపీలో బీజేపీ

యూపీలో బీజేపీ, పంజాబ్‌లో ఆప్ మెజార్టీ సీట్లకు సంబంధించి.. జోరుగా బెట్టింగ్ జరుగుతుంది. పంజాబ్‌లో హంగ్ అసెంబ్లీ తప్పదని బుకీలు చెబుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఛాన్స్ ఉంది. ఎన్నికకు సంబంధించి రూ.50 వేల కోట్ల టర్నోవర్ చేయాలని బెట్టింగ్ మాఫియా అనుకుంటుంది. బెట్టింగ్ పరిణామం రోజు రోజుకు మారుతుంది. ఎందుకంటే పార్టీలు ప్రజలను ఓట్లు అడగడం.. ట్రెండ్ మారే అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ఈ అంశాలు

ఈ అంశాలు

రాజకీయాలు, రైతు ఆందోళనల నేపథ్యం కూడా పరిగణలోకి తీసుకుంటారు. యూపీలో బీజేపీ 250కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తోందని అంచనా వేశారు. దీంతో కమల దళం మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని చెప్పాల్సి ఉంటుంది. 2017లో బీజేపీ 312 సీట్లు గెలిచి తిరుగులేని శక్తిగా అవతరించింది. అయితే ఈ సారి 50 నుంచి 60 సీట్లను బీజేపీ కోల్పోతుందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ యూపీలో గల ముస్లిం ప్రాబల్యం గల ప్రాంతాల్లో బీజేపీకి దెబ్బ తగులుతుందని తెలిపింది. ఆ స్థానాలను ఎస్పీ గెలుచుకుంటుందని భావిస్తోంది. సీఏఏ గురించి ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనలు కూడా కలిసి వస్తాయి. ఇదివరకు 47 ఉన్న ఎస్పీ సీట్ల సంఖ్య ఇప్పుడు 100కి చేరనుందని తెలిపింది.

ఇలా చెల్లింపు

ఇలా చెల్లింపు

యూపీలో బీజేపీ 200 సీట్లు గెలుచుకుంటుందని బుకీలు రూపాయికి 20 పైసలు బెట్ చేస్తున్నారు. బీజేపీ 222 సీట్లు గెలిస్తే 1.15 రూపాయి ఇస్తారు. ఒకవేళ ఎస్పీ 125 సీట్లు గెలిస్తే బుకీలు 1.40 రూపాయి ఇస్తారు. ఎస్పీ 110 సీట్లు గెలిస్తే 35 పైసలు ఇస్తారు. ఇక ఇక్కడ కాంగ్రెస్, బీఎస్పీ మాత్రం 5 నుంచి 10 సీట్లు గెలుచుకుంటారని భావిస్తున్నారు. అయితే ఎంఐఎం సీట్లు అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ రానుంది. అందులో యూపీ ప్రజలకు వరాలు ఉంటాయి. దానిని అనుగుణంగా బుకీలు తమ బెట్ నిర్వహిస్తున్నారు.

పంజాబ్‌లో ఇలా

పంజాబ్‌లో ఇలా

ఇక పంజాబ్ విషయానికి వస్తే ఆప్, కాంగ్రెస్ 40, 40 సీట్లను గెలుచుకుంటాయని చెబుతున్నారు. కనీసం 25 సీట్లు పక్కా అని తెలిపారు. బీజేపీ, అకాలిదల్ 5 నుంచి 10 సీట్లకే పరిమితం అవుతాయని అంచనా వేశారు. అయితే ఇదీ ఇప్పటివరకు ఉన్నా అంచనా.. ఇదీ మారే అవకాశం కూడా ఉంటుంది.

English summary
Bharatiya Janata Party will retain power in Uttar Pradesh, India's largest state illegal betting market, Satta Bazar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X