జయలలిత కారు డ్రైవర్ ఎన్ కౌంటర్: కొడనాడు హత్య, కేరళలో ఇలా, ఎవరి వైపు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై/సేలం: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సంబంధం ఉన్న వారు అనుమానస్పంద స్థితిలో మరణించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులే ఎన్ కౌంటర్ చెయ్యడంతో అమ్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ అలియాస్ కనగరాజ్ అనుమానాస్పదస్థితిలో మరణించాడు. సేలంలో కనకరాజ్ పోలీస్ ఎన్ కౌంటర్ లో అంతం అయ్యాడు. అయితే కనకరాజ్ ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో మరో నిందితుడికి కేరళ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైనాయని పోలీసులు చెప్పారు. దీని వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పుమన్నాయి.

కేరళలో రోడ్డు ప్రమాదం

కేరళలో రోడ్డు ప్రమాదం

జయలలిత కొడనాడు ఎస్టేట్ బంగ్లాలో సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కేరళలో ఓ వక్యిని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెబుతున్న సమయంలో అనేక అనుమానాలు వెలుగు చూశాయి.

నిందితుడికి సీరియస్

నిందితుడికి సీరియస్

జయలలిత కొడనాడు టీ ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు ఓం బహుదూర్ హత్య కేసులో నిందితుడు సయాన్ అలియాస్ సయన్ కేరళలో ప్రమాదనికి గురైనాడు. సయాన్ ప్రస్తుతం కేరళలోని పాలక్కాడు ఆసుపత్రిలో చేరాడు. ప్రమాదానికి గురైన సయన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు.

ఒక్కరు అరెస్టు అయితే

ఒక్కరు అరెస్టు అయితే

జయలలిత కొడనాడు టీ ఎస్టేట్ లో హత్య కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కేరళలో దర్యాప్తు చేసి ఓ వ్యక్తిని కేరళలో పోలీసులు అరెస్టు చేశారు. తరువాత కేసు దర్యాప్తు పలుమలుపులు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జయలలిత డ్రైవర్ ఎన్ కౌంటర్

జయలలిత డ్రైవర్ ఎన్ కౌంటర్

జయలలిత కొడనాడు ఎస్టేట్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న కనకరాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అతను తమిళనాడులోని సేలంలో అనుమానాస్పదస్థితిలో మరణించాడు. పోలీసుల ఎన్ కౌంటర్ లో కనకరాజ్ అంతం అయ్యాడు.

పోలీసులు కావాలనే చంపేశారా ?

పోలీసులు కావాలనే చంపేశారా ?

జయలలిత కొడనాడు ఎస్టేట్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులను ప్రాణాలతో పట్టుకుని అసలు రహస్యం బయటకు తియ్యాలి. అయితే ఒక్కరు అరెస్టు అయిన వెంటనే జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ పోలీసుల ఎన్ కౌంటర్ లో అంతం కావడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎవరు ఉన్నారు

ఎవరు ఉన్నారు

జయలలిత కొనాడు ఎస్టేట్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న్ సయన్ కేరళలో జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలై చావుబ్రతుకుల మధ్య పోరాడుతుండటం, జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ ఎన్ కౌంటర్ లో అంతం కావడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తమిళనాడు ప్రజలు అంటున్నారు.

వస్తారా

వస్తారా

జయలలిత కొనాడు ఎస్టేట్ లో దాదాపు 10 మంది నిందితులు చొరబడి సెక్యూరిటీ గార్డును అంతం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఎంత మంది ప్రాణాలతో ఉంటారు ? అనే విషయం అంతుచిక్కడం లేదని అమ్మ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jayalalithaa’s Ex-Driver Kanagaraj, who is wanted person in Kotanad Estate murder case, was suspected killed by encounter by police in Salem.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి