వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త సంవత్సరంలో శుభవార్త, , బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించే అవకాశం

కారు, ఇళ్ళు కొనుగోలుచేయాలనే వారికి కొత్త సంవత్సరం శుభవార్త వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. వినియోగాన్ని పెంచేందుకుగాను బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించనున్న

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబాయి :కొత్త సంవత్సరంలో కొత్త కార్లు, ఇళ్లు ఇతరత్రా బ్యాంకు రుణాలు తీసుకొని కొనుగోలుచేసేవారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. వడ్డీరేట్లను బ్యాంకులు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి మాసంలో అన్ని బ్యాంకులు తమ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

కొత్త సంవత్సరం అందరికీ మంచిని తీసుకువస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. అయితే వడ్డీరేట్లను తగ్గిస్తే రుణాలు తీసుకొనేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

2017 జనవరి మాసంలోనే వడ్డీరేట్లను తగ్గించేందుకుగాను ప్లాన్ చేస్తున్నాయి. వడ్డీరేట్లను తగ్గించడం ద్వారా కొత్తగా కొనుగోలుచేసే పరిస్థితి తగ్గిపోయింది.దీన్ని అధిగమించేందుకు బ్యాంకులు ప్లాన్ చేస్తున్నాయి. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత దేశంలో వినియోగాన్ని పెంచాలంటే రుణాలను ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.ఈ పరిస్థితుల్లో బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాలని భావిస్తున్నాయి.

ఎస్ బి ఐ తో పాటు ఇతర బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంకు అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. నిత్యావసర సరుకులు కాకుండా ఇతర వస్తువుల వినిమయం గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రుణాలుఇవ్వడం తప్పనిసరని బ్యాంకులు నిర్ణయానికి వచ్చాయి.ఈ నిర్ణయం మేరకు బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించేందుకు ముందుకు వచ్చాయి.

sbi,few other banks may cut lending rates in new year

కొత్త ఇళ్ళు, కారుతో పాటు ఇతరత్రా కొనుగోలుచేసేందుకు చౌకగా బ్యాంకులు అప్పులు ఇవ్వనున్నాయి. కొత్త సంవత్సరంలో కొత్త వస్తువుల కొనుగోలు కోసం బ్యాంకులు కారుచౌకగా అప్పులు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటన చేయనున్నాయి.

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకు భారీ మొత్తంలో డిపాజిట్లు వచ్చాయి. బ్యాంకుల లిక్విడిటీ కూడ పెరిగింది. గత వారం ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ బేటీ అయిన బ్యాంకులు వడ్డీరేట్ల కోతల విషయమై చర్చించారు. వడ్డీరేట్ల తగ్గింపు విషయమై చర్చించారు. ఇదే విషయాన్ని ఆర్థికమంత్రి జైట్లీతో కూడ చర్చించారని సమాచారం.

English summary
sbi and other banks are expected to announce a cut in lending rates effective early january, said people with knowledge of the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X