'తాజ్'ను వేలం వేయాల్సిందే: ఢిల్లీ మున్సిపల్‌ బోర్డుకు సుప్రీం కోర్టు ఆదేశం..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రముఖ హోటల్ తాజ్‌మాన్ సింగ్ ను వేలం వేయాల్సిందేనన్న కేజ్రీవాల్ నిర్ణయానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. హోటల్‌ను వేలం వేయాల్సిందేనని చెప్పింది. హోటల్ ను తమ సంస్థ ఆధ్వర్యంలో నడపడానికి టాటా గ్రూప్ కుదుర్చుకున్న ఒప్పందం ఇటీవల ముగియడంతో.. హోటల్ ను వేయం వేయాలని సుప్రీం పేర్కొంది.

వేలంలో టాటా గ్రూప్ కూడా పాల్గొనే అవకాశం ఉండగా.. ఒకవేళ ఆ సంస్థకు అవకాశం దక్కకపోతే.. హోటల్ ను ఖాళీ చేసేందుకు 6నెలల గడువు ఉంటుందని వివరించింది. ఢిల్లీలో తాజ్‌మాన్ సింగ్ గా పేరొందిన ఈ హెటల్ 33ఏళ్లుగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. 2011లో ఒప్పందం ముగియడంతో ఎటువంటి వేలం లేకుండా మరో తొమ్మిదిసార్లు టాటా గ్రూపే ఈ అవకాశాన్ని దక్కించుకుంది.

SC allows NDMC to e-auction Taj Mansingh hotel

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఇందుకు అనుమతినిచ్చింది. అయితే ఇటీవల అద్దె విషయంలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్(ఎన్ఎండీసీ) కు టాటా గ్రూప్‌కు మధ్య విభేదాలు రావడంతో, హోటల్ ను వేలం వేయాల్సిందేనని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఎన్ఎండీసీ హోటల్ ను వేలం వేసేందుకు అనుమతించాలని కోరింది. ఎన్ఎండీసీ వాదనతో ఏకీభవిస్తూ ఈ-వేలం(ఆన్ లైన్ వేలం)కు న్యాయస్థానం అనుమతినిచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The iconic Tan Mansingh hotel will be put under the hammer as the Supreme Court on Thursday allowed New Delhi Municipal Corporation to e-auction the property.
Please Wait while comments are loading...