ఏపీ, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిలు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో కొత్త జడ్జిల నియామకానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దాంతో ఏపీ హైకోర్టుకు నలుగురు.. తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు చొప్పున న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం లభించినట్లైంది.
ఏపీ హైకోర్టుకు జస్టిస్ బి.ఎస్. భానుమతి, జస్టిస్ సిహెచ్. మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఎం. వెంకటరమణ, జస్టిస్ ఎ. హరి హరనాధ శర్మ పేర్లను సిఫార్సు చేసింది సుప్రీం కొలీజియం. తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ పి. శ్రీసుధ, జస్టిస్ సి. సుమలత, జస్టిస్ ఎన్. తుకారాంజి ల పేర్లు ఖరారు చేసింది.













Click it and Unblock the Notifications