సుప్రీంలో అసాధారణ కేసు-మద్రాస్ హైకోర్టుకు బీజేపీ లింకుల జడ్డి-కొలీజియం, కేంద్రం ఆమోదించినా !
బీజేపీతో సంబంధాలు కలిగి, ముస్లిం-క్రైస్తవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చరిత్ర కలిగిన ఓ మహిళా జడ్డిని మద్రాస్ హైకోర్టులో నియమించిన వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ అత్యవసర విచారణ చేపట్టనుంది.
దేశవ్యాప్తంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్డీల నియామకాల వ్యవహారంపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వివాదం నెలకొన్న వేళ.. మద్రాస్ హైకోర్టులో ఓ అసాధారణ పరిణామం చోటు చేసుకుంది. మద్రాస్ హైకోర్టు కొలీజియం ఎల్సీవీ గౌరీ (లక్షణ చంద్ర విక్టోరియా గౌరీ) అనే న్యాయవాది పేరును అదనపు జడ్డిగా ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియానికి పంపింది. అక్కడ సుప్రీంకోర్టు కొలీజియం కూడా ఆమోదముద్ర వేయడంతో కేంద్రం కూడా నోటిఫికేషన్ ఇచ్చేసింది. కానీ అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్రం ఆమోద ముద్ర పడి ఆమె విధుల్లో చేరే సమయానికి సుప్రీంకోర్టు ముందుకు ఆమె నియామకంపై అభ్యంతరాలు వచ్చాయి.
బీజేపీ నేతలతో ఎల్సీవీ గౌరి సత్సంబంధాలు ఉన్నాయని, గతంలో ముస్లిం, క్రైస్తవులను దూషిస్తూ ఆమె ప్రసంగాలు కూడా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. వాస్తవానికి న్యాయమూర్తిగా నియమించే వారికి ఎలాంటి వివాదాస్పద చరిత్ర ఉండకూడదు. అలాగే సమాజంలో ఏ వర్గానికి వ్యతిరేకమన్న ముద్ర కూడా ఉండకూడదు. నిజాయితీ, సచ్ఛీలత ఉన్న వారినే నియమించాలి. కానీ మద్రాస్ హైకోర్టు కొలీజియం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు ధర్మానసం అత్యవసర విచారణ చేపట్టబోతోంది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో గౌరీ పేరును ఆమోదించడంతో ఆమె మరో నలుగురు న్యాయమూర్తులతో కలిసి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఇవాళ ఉదయం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆలోపే సుప్రీంకోర్టు దృష్టికి ఆమె వ్యవహారం వెళ్లడంతో కాసేపట్లో అత్యవసర విచారణ చేపట్టి ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గౌరిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే అత్యవసర ఆదేశాలతో ఆమె ప్రమాణ స్వీకారాన్ని సుప్రీకోర్టు నిలిపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications